బంగ్లాదేశ్ హైకమిషనర్ రిజాజ్ హమీదుల్లా(Riaz Hamidullah) అత్యవసరంగా భారత్ నుంచి ఢాకా వెళ్లారు. అది కూడా బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రిత్వశాఖ నుంచి అత్యవసర కాల్ రావడంతో సోమవారం రాత్రి ఢాకా చేరుకున్నారని వార్తలు వెలువడ్డాయి. ఇటీవల బంగ్లాలో భారత్ కు(India) వ్యతిరేకంగా జరిగిన ఆందోళనల నేపథ్యంలో ఇరుదేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్న విషయం విధితమే. దైపాక్షిక సంబంధాల పరిస్థితిపై చర్చలు జరిపేందుకు రిజాజ్ హమీదుల్లాను ఢాకాకు పిలిపించారని విదేశాంగ మంత్రిత్వ శాఖ బంగ్లా మీడియాకు తెలిపింది.
Read Also: Donald Trump: పుతిన్ నివాసంపై దాడి మండిపడ్డ ట్రంప్
భారత రాయబార కార్యాలయంపై బెదిరింపులు
ఇటీవల ఢాకాలోని భారత రాయబార కార్యాలయంపై అక్కడి వ్యక్తులు బెదిరింపులకు పాల్పడిన విషయాన్ని భారత(India) ప్రభుత్వం రిజాజ్ హమీదుల్లాకు సమన్లు జారీ చేసింది. బంగ్లాలో క్షీణిస్తున్న భద్రతా పరిస్థితులపై హమీదుల్లా(Riaz Hamidullah) ముందు భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. బంగ్లా నాయకుడు హస్నత్ అబ్దుల్లా ఇటీవల భారత్ కు వ్యతిరేకంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బంగ్లాను అస్థిరపరిస్తే సెవెన్ సిస్టర్స్ ను ముట్టడిస్తామని హెచ్చరించారు.
దెబ్బతిన్న రెండు దేశాల సంబంధాలు
గతేడాది విద్యార్థుల ఆందోళన తర్వాత షేక్ హసీనా ప్రధానిగా రాజీనామా చేసి, భారత్ లో తలదాచుకుంటున్న విషయం తెలిసిందే. అప్పటి నుంచి భారత్-బంగ్లా సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. భారత్ కు వ్యతిరేకంగా అక్కడి నాయకులు పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. దెబ్బతిన్న ద్వైపాక్షిక సంబంధాల పరిస్థితిపై చర్చలు జరిపేందుకు రిజాజ్ హమీదుల్లాను బంగ్లాకు పిలిపించుకున్నట్లు బంగ్లా విదేశాంగ మంత్రిత్వశాఖ తెలిపినట్లుగా బంగ్లా మీడియా తెలిపింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: