📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన నేటి నుంచే సోషల్ మీడియా వెట్టింగ్ బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ ఇండిగో కీలక నిర్ణయం నష్టపోయిన ప్రయాణి కులకు ఇండిగో నగదు అందివేత గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన నేటి నుంచే సోషల్ మీడియా వెట్టింగ్ బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ ఇండిగో కీలక నిర్ణయం నష్టపోయిన ప్రయాణి కులకు ఇండిగో నగదు అందివేత

ట్రంప్‌ హామీతో టిక్‌టాక్‌ సేవల పునరుద్ధరణ

Author Icon By Vanipushpa
Updated: January 20, 2025 • 3:06 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అగ్రరాజ్యం అమెరికాలో ప్రముఖ షార్ట్‌ వీడియో యాప్‌ టిక్‌టాక్‌ మూగబోయిన విషయం తెలిసిందే. జనబాహుల్యంలో విశేష ఆదరణ పొందిన ఈ షార్ట్‌ వీడియో యాప్‌ను నిషేధించేందుకు తీసుకొచ్చిన చట్టం ఆదివారం నుంచే అమల్లోకి రావడంతో తన సేవలను సంస్థ ఒకరోజు ముందే నిలిపివేసింది. ఈ విషయాన్ని స్వయంగా ఆ కంపెనీ మాతృసంస్థ బైట్‌డ్యాన్స్‌ ప్రకటించింది. అయితే, ఈ ప్రకటన చేసిన కొద్దిసేపటికే టిక్‌టాక్‌ మరో ప్రకటన చేసింది. యూజర్లకు తిరిగి సేవలను పునరుద్దరించే ప్రక్రియ కొనసాగుతోందని తెలిపింది. ఈ మేరకు ‘యూఎస్‌లో టిక్‌టాక్‌ ఈజ్‌ బ్యాక్‌’ అంటూ పోస్టు పెట్టింది.
టిక్‌టాక్‌ సేవలకు సంబంధించి కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కీలక ప్రకటన చేసిన విషయం తెలిసిందే. టిక్‌టాక్‌ కంపెనీలో కనీసం 50 శాతం వాటా అమెరికా పెట్టుబడిదారుల చేతిలో ఉండేలా షరతులు విధిస్తూ ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్‌ ద్వారా వాటి సేవలను పునరుద్ధరించనున్నట్లు ప్రకటించారు.

ట్రంప్‌ ప్రకటనపై టిక్‌టాక్‌ స్పందించింది. అమెరికాలో తమ సేవలు పునరుద్ధరణపై ట్రంప్‌ నుంచి భరోసా లభించడంతో ధన్యవాదాలు తెలిపింది. ఈ మేరకు ఓ ట్వీట్‌ పెట్టింది. ‘మా సర్వీస్‌ ప్రొవైడర్లతో కుదిరిన ఒప్పందం ప్రకారం.. అమెరికాలో తిరిగి టిక్‌టాక్‌ సేవలను పునరుద్ధరించే ప్రక్రియ కొనసాగుతోంది. ఈ విషయంలో కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు ధన్యవాదాలు తెలుపుతున్నాం.

మా సర్వీస్ ప్రొవైడర్లు ఎదుర్కొనే పెనాల్టీలపై ఆయన హామీ ఇచ్చారు. ఫలితంగా 17 కోట్ల మంది అమెరికన్లకు టిక్ టాక్‌ సేవలు అందుతాయి. 70 లక్షల చిన్న వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. ఇది ఏకపక్ష సెన్సార్‌షిప్‌కు వ్యతిరేకంగా ట్రంప్ ఇచ్చిన బలమైన స్టాండ్. టిక్‌టాక్‌ను తిరిగి కొనసాగిస్తూ దీర్ఘ కాలిక పరిష్కారాల కోసం అధ్యక్షుడు ట్రంప్‌తో కలిసి పని చేస్తాం’ అని తెలిపింది.

Restoration tiktok trumps promise

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.