📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Singapore: భరణం కట్టలేక 6 కోట్ల ప్యాకేజీ ఉద్యోగానికి రాజీనామా..మొట్టికాయ వేసిన కోర్టు

Author Icon By Vanipushpa
Updated: January 22, 2026 • 11:31 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

మెయింటెనెన్స్ కేసుల గురించి మనం తరచుగా వింటూనే ఉంటాం. కానీ, భార్య భరణం అడిగిందని కోట్ల జీతం వచ్చే ఉద్యోగాన్ని వదిలేశాడు ఓ వ్యక్తి. సినిమాల్లో కనిపించే ఇంటర్వెల్ ట్విస్ట్‌లా ఉన్న ఈ రియల్ లైఫ్ స్టోరీ ఇప్పుడు ఇంటర్నెట్ లో వైరల్ అవుతోంది. దీని గురించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. 6 కోట్ల ప్యాకేజీ.. సింగపూర్‌లో విలాసవంతమైన జీవితం! కెనడాకు చెందిన ఒక వ్యక్తి.. సింగపూర్‌లోని ఒక మల్టీ నేషనల్ కంపెనీలో సీనియర్ ఎగ్జిక్యూటివ్ హోదాలో పని చేసేవాడు. అతని వార్షిక ఆదాయం అక్షరాలా 8.6 లక్షల సింగపూర్ డాలర్లు. అంటే మన భారతీయ కరెన్సీలో దాదాపు 6 కోట్ల రూపాయల అన్నమాట. భార్య, నలుగురు పిల్లలతో కలిసి సింగపూర్‌లో ఎంతో లగ్జరీగా ఉండేవారు. పిల్లలు అక్కడ ఖరీదైన ఇంటర్నేషనల్ స్కూల్స్‌ లో చదువుకునేవారు. అయితే 2023 ఆగస్టులో ఆ దంపతుల మధ్య గొడవలు మొదలై విడిపోయారు (Divorce). అతను తన భార్యను వదిలేసి వేరే మహిళతో ఉండటం ప్రారంభించాడు. అక్కడే అసలు కథ మొదలైంది.

Read Also: Davos : విశాఖలో కాగ్నిజెంట్ పనులు వేగవంతం చేయండి – నారా లోకేశ్

Singapore: భరణం కట్టలేక 6 కోట్ల ప్యాకేజీ ఉద్యోగానికి రాజీనామా..మొట్టికాయ వేసిన కోర్టు

నెలకు 15 లక్షల రూపాయల భరణం కావాలని డిమాండ్

భరణం భయంతో రిజైన్? మొదట్లో తన భార్యకు, పిల్లలకు కలిపి నెలకు సుమారు 15.5 లక్షల రూపాయలు (20,000 సింగపూర్ డాలర్లు) ఇస్తానని అతను ఒప్పుకున్నాడు. కానీ, ఆ తర్వాత నెమ్మదిగా ఆ మొత్తాన్ని 7.7 లక్షలకు తగ్గించేశాడు. దీంతో తన పిల్లల చదువు, జీవనశైలి దెబ్బతింటుందని భావించిన భార్య కోర్టును ఆశ్రయించింది. తమ పాత లగ్జరీ లైఫ్ స్టైల్ ప్రకారం నెలకు 15 లక్షల రూపాయల భరణం కావాలని డిమాండ్ చేస్తూ అప్లికేషన్ పెట్టుకుంది. విచిత్రం ఏంటంటే, కోర్టులో ఈ కేసు ఫైల్ అయిన కొద్ది రోజుల్లోనే (అక్టోబర్ 9, 2023న) సదరు వ్యక్తి తన 6 కోట్ల రూపాయల ఉద్యోగానికి రాజీనామా చేసేశాడు. వాస్తవానికి అతను 2024 జూలై వరకు అదే జీతంతో పని చేసే అవకాశం ఉన్నా సరే.. భరణం కట్టడం ఇష్టం లేకనే అతను హడావుడిగా ఉద్యోగం వదిలేశాడట. దీంతో నెట్టింట ఈ వార్త తెగ వైరల్ (viral) అవుతోంది.

పాత జీతం ప్రకారమే భరణం కట్టాలి: కోర్టు

కోర్టు గట్టి షాక్ ఇచ్చింది! ఉద్యోగం మానేసి కెనడా వెళ్ళిపోయిన ఆ వ్యక్తికి సింగపూర్ కోర్టు కళ్లు చెదిరే తీర్పు ఇచ్చింది. “నువ్వు భరణం నుండి తప్పించుకోవడానికే కావాలని ఉద్యోగం వదిలేశావు. కాబట్టి, నువ్వు ఉద్యోగం లేదని చెప్పినా చెల్లదు. నీ పాత జీతం ప్రకారమే భరణం కట్టాలి” అని జడ్జి తేల్చి చెప్పారు. బాధ్యత గల తండ్రిగా రాజీనామా చేసే ముందే కుటుంబానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాల్సిందని కోర్టు మొట్టికాయలు వేసింది. సెప్టెంబర్ 2023 నుండి సెప్టెంబర్ 2025 వరకు బకాయి ఉన్న మొత్తాన్ని లెక్కగట్టిన కోర్టు.. దాదాపు 3.9 కోట్ల రూపాయలను (6,34,000 సింగపూర్ డాలర్లు) వెంటనే చెల్లించాలని ఆదేశించింది. జనవరి 15, 2026 లోపు ఈ మొత్తం లంప్ సమ్ అమౌంట్‌ గా కట్టాలని గడువు విధించింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

6 crore package job resignation alimony dispute court reprimand high salary divorce case Indian court news legal battle over alimony maintenance case

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.