📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Oil Prices Decrease: సామాన్యులకు ఊరట..తగ్గనున్న వంటనూనె ధరలు?

Author Icon By Anusha
Updated: February 22, 2026 • 12:22 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Oil Prices Decrease: నిత్యావసర ధరల భారంతో సతమతమవుతున్న సామాన్యులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. మార్కెట్‌లో వంటనూనెల ధరలు మరింత తగ్గేలా కీలక నిర్ణయం తీసుకుంది. క్రూడ్ పామాయిల్, సోయాబీన్ ఆయిల్,సన్‌ఫ్లవర్ ఆయిల్స్‌పై విధిస్తున్న దిగుమతి సుంకాన్ని (Import Duty) భారీగా తగ్గించింది..

Read Also: ISRO YUVIKA 2026: 9వ తరగతి విద్యార్థులకు యువ శాస్త్రవేత్తల కార్యక్రమం

Relief for the common man.. Cooking oil prices to decrease?

10 శాతం సుంకం తగ్గింపు.. మే 31 నుంచి అమలు

కేంద్ర ప్రభుత్వం వంటనూనెల దిగుమతి సుంకంపై 10% కోత విధించింది. ప్రస్తుతం అమల్లో ఉన్న 27.5% సుంకాన్ని 16.5% కి తగ్గించింది. ఈ నూతన ధరల తగ్గింపు నిర్ణయం మే 31 నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి రానుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ధరల హెచ్చుతగ్గుల నేపథ్యంలో దేశీయంగా వినియోగదారులపై భారం పడకుండా ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంది.

ఈ దేశాల నుంచి దిగుమతి..

దేశీయంగా వినియోగించే వంటనూనెల్లో 70 శాతం విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. మలేషియా, ఇండోనేషియా, థాయ్‌లాండ్‌ నుంచి పామాయిల్‌ దిగుమతి అవుతోంది. బ్రెజిల్‌, అర్జెంటీనా, రష్యా, ఉక్రెయిన్‌ నుంచి సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌ దిగుమతి చేసుకుంటున్నాం.కాగా, క్రూడ్‌, రిఫైన్‌ వంటనూనెలపై సెప్టెంబరు 2024లో కస్టమ్స్‌ సుంకాన్ని 20 శాతానికి కేంద్ర ప్రభుత్వం పెంచింది.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

Crude Soyabean Oil Price Import Duty Cut on Oil Oil Prices Decrease Sunflower Oil Price

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.