📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Latest Telugu News: H-1B Visa: భారతీయ విద్యార్థులకు భారీ ఊరట

Author Icon By Vanipushpa
Updated: October 22, 2025 • 10:50 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అమెరికాలో ఉన్నత విద్య, ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న లక్షలాది మంది భారతీయులకు అక్కడి ప్రభుత్వం భారీ ఊరట కల్పించింది. హెచ్-1బీ వీసా(H-1B Visa) కోసం ప్రతిపాదించిన లక్ష డాలర్ల (సుమారు రూ. 8.3 కోట్లు) భారీ ఫీజు విషయంలో కీలక స్పష్టతనిచ్చింది. ఇప్పటికే అమెరికాలో ఎఫ్‌-1 (విద్యార్థి), జే-1 (పరిశోధకులు), ఎల్-1 (అంతర్గత బదిలీ) వంటి వీసాలపై ఉన్నవారు హెచ్-1బీకి మారేటప్పుడు ఈ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని అమెరికా పౌరసత్వ, వలస సేవల విభాగం (యూఎస్‌సీఐఎస్‌) అధికారికంగా ప్రకటించింది.

Read Also: Diwali Celebration : వైట్ హౌస్లో దీపావళి వేడుకలు.. భారతీయులకు ట్రంప్ విషెస్

తాజా మార్గదర్శకాల ప్రకారం..

యూఎస్‌సీఐఎస్‌ విడుదల చేసిన తాజా మార్గదర్శకాల ప్రకారం, ఈ ఫీజు నిబంధన అమెరికా(America) వెలుపల నుంచి కొత్తగా హెచ్-1బీ వీసా కోసం దరఖాస్తు చేసుకునేవారికి మాత్రమే వర్తిస్తుంది. ఇప్పటికే అమెరికాలో చదువు పూర్తి చేసుకుని ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ (ఓపీటీ)లో ఉన్న విద్యార్థులకు ఈ నిబంధన నుంచి మినహాయింపు లభించనుంది. అలాగే, ప్రస్తుతం హెచ్-1బీపై పనిచేస్తూ వీసాను పునరుద్ధరించుకునేవారికి లేదా వేరే కంపెనీకి మారేవారికి కూడా ఈ ఫీజు వర్తించదని స్పష్టం చేసింది.

H-1B Visa

పాత నిబంధనలే వర్తిస్తాయి

అయితే, ఈ మినహాయింపులకు కొన్ని షరతులు వర్తిస్తాయని యూఎస్‌సీఐఎస్‌ తెలిపింది. ఎవరైనా విద్యార్థి వీసాపై ఉన్నప్పుడు నిబంధనలకు విరుద్ధంగా అనధికారిక పనులు చేసినట్లు తేలితే, వారికి ఈ మినహాయింపు లభించదు. అలాంటి వారి వీసా మార్పు దరఖాస్తు తిరస్కరణకు గురైతే, వారు లక్ష డాలర్ల ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. 2025 సెప్టెంబర్ 21వ తేదీకి ముందు హెచ్-1బీ కోసం దరఖాస్తు చేసుకుని ఆమోదం పొందిన వారికి కూడా పాత నిబంధనలే వర్తిస్తాయని పేర్కొంది. ప్రస్తుతం అమెరికాలో 3.3 లక్షల మంది భారతీయ విద్యార్థులు చదువుతుండగా, వారిలో సుమారు లక్ష మంది ఓపీటీలో ఉన్నారు. ఈ తాజా నిర్ణయంతో స్టెమ్ కోర్సులు చదివి, మూడేళ్ల వరకు అమెరికాలో పనిచేసే అవకాశం ఉన్న విద్యార్థులకు ఎంతో ప్రయోజనం చేకూరనుంది.

Hib వీసా స్థితి అంటే ఏమిటి?
J-1 నుండి H-1B వీసా: బదిలీ, ప్రాసెసింగ్ సమయం, స్థితి మార్పు
H-1B వీసా స్థితి అనేది యునైటెడ్ స్టేట్స్ పౌరసత్వం మరియు ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (USCIS)తో H-1B పిటిషన్ యొక్క ప్రస్తుత స్థితిని సూచిస్తుంది, అంటే అది ఆమోదించబడిందా, తిరస్కరించబడిందా లేదా పెండింగ్‌లో ఉందా.

H-1B కి ఎంత జీతం?
H-1B జీతాలు ఉద్యోగం, స్థానం మరియు అనుభవం ఆధారంగా మారుతూ ఉంటాయి, కానీ H-1B వీసా హోల్డర్ యొక్క సగటు జీతం 2025లో దాదాపు $120,000.

Read hindi news: https://hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

education Government Schemes Indian students Latest News Breaking News scholarships Student Relief student welfare Study Abroad Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.