📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Trump vs Musk : ట్రంప్ వ్యాఖ్యలకు చింతిస్తున్నా – మస్క్

Author Icon By Sudheer
Updated: June 11, 2025 • 1:27 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ (Trump vs Musk) మధ్య గతకొద్ది రోజులుగా జరుగుతున్న వాగ్వాదం పెద్ద ఎత్తున వార్తల్లో నిలిచింది. అమెరికా(America )లో కొత్తగా ప్రవేశపెట్టబోయే ట్యాక్స్ బిల్లును వ్యతిరేకిస్తూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై మస్క్ తీవ్రంగా స్పందించారు. మస్క్ చేసిన ట్వీట్లు కొంత వివాదాస్పదంగా మారాయి. ట్రంప్ నాయకత్వంపై ఘాటు వ్యాఖ్యలు చేసిన మస్క్ సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలకు గురయ్యారు. ఈ పరిస్థితుల మధ్య మస్క్ తాను చేసిన వ్యాఖ్యలపై చింతిస్తూ స్పందించారు.

క్షమాపణలు చెప్పిన మస్క్

ఎలాన్ మస్క్ ట్విటర్ ద్వారా స్పందిస్తూ, “గత వారం ట్రంప్ గురించి నేను చేసిన కొన్ని పోస్టులపై ఇప్పుడు చింతిస్తున్నా. అవి అనవసరంగా చాలా దూరం వెళ్లాయి” అని పేర్కొన్నారు. ఈ ట్వీట్ ద్వారా మస్క్ తమ మధ్య కొనసాగుతున్న మాటల పోరుకు ముగింపు పలికే ప్రయత్నం చేసినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. వ్యాపారవేత్తగా మాత్రమే కాకుండా సోషల్ మీడియాలో తన అభిప్రాయాలను సూటిగా చెప్పే వ్యక్తిగా మస్క్ సుపరిచితుడు. కానీ ఈసారి తన వ్యాఖ్యలు హద్దులు దాటి పోయాయని గ్రహించి, దిగజారి క్షమాపణలు చెప్పడం విశేషం.

సయోధ్యకు మార్గం?

మస్క్ ఈ వ్యాఖ్యలతో ట్రంప్ సంబంధాలను సర్దుబాటు చేసుకునే ప్రయత్నం చేస్తున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ట్యాక్స్ బిల్లుతో మొదలైన ఈ వివాదం వ్యక్తిగత విమర్శల దాకా వెళ్లడంతో రాజకీయంగా, కార్పొరేట్ స్థాయిలో పెద్ద దుమారం రేగింది. ఇప్పుడు మస్క్ తాను చేసిన వ్యాఖ్యలపై చింతిస్తూ దిగొచ్చిన తరుణంలో ట్రంప్ ఎలా స్పందిస్తారో అన్నది ఉత్కంఠగా మారింది. అయితే మస్క్ క్షమాపణలతో వారిద్దరి మధ్య సయోధ్యకు మార్గం సుగమమవుతుందా అన్నదే ప్రస్తుత చర్చ.

Read Also : Mangli: మంగ్లీ పుట్టినరోజు వేడుకల్లో డ్రగ్స్ కలకలం

Trump Comments Trump vs Musk

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.