మగువలు ఎంత మేకప్ వేసుకున్న అదరాలకు లిప్‌స్టిక్ (Lip Stick) అద్దకుంటే అలంకరణ పూర్తి కాదు. లిప్‌స్టిక్ అందం, ఆత్మవిశ్వాసానికి చిహ్నంగా భావిస్తారు. ప్రస్తుతం మార్కెట్లో అనేక రకాల లిప్‌స్టిక్‌లు అందుబాటులో ఉన్నాయి. లిప్‌స్టిక్ వివిధ రంగులలో కూడా లభిస్తుంటాయి. అయితే లిప్‌స్టిక్ ధర మాత్రం బ్రాండ్ ప్రకారం మారుతుంది. ప్రపంచవ్యాప్తంగా రెడ్ లిప్‌స్టిక్ ఉపయోగించే మహిళల సంఖ్య ఎక్కువట. కానీ ఇప్పుడు ఇదే ఎరుపు లిప్‌స్టిక్ మహిళలకు సమస్యగా మారింది.
Read Also: Bangladesh: 17 ఏళ్ల బహిష్కరణ తర్వాత తారిక్ స్వదేశానికి తిరిగివచ్చారు
లేత రంగు లిప్‌స్టిక్‌లను మాత్రమే వాడాలి
ఉత్తర కొరియా (North Korea) లో మహిళలు ఎరుపు రంగు లిప్‌స్టిక్‌ను ధరించడంపై అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ నిషేధం విధించారు. దీనిని పాశ్చాత్య సంస్కృతి, పెట్టుబడిదారీ విధానానికి చిహ్నంగా భావిస్తూ, యువతలో వ్యక్తివాదాన్ని పెంచుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. దేశం సంక్షోభాన్ని ఎదుర్కోవచ్చని భావిస్తూ, ఉత్తర కొరియా (North Korea) మహిళలు తమ దేశంలో తయారైన లేత రంగు లిప్‌స్టిక్‌లను మాత్రమే వాడాలని ఆదేశించారు. ఆడంబరమైన మేకప్ నిబంధనలకు విరుద్ధమని, ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటారని తెలుస్తోంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: