North Korea: నార్త్ కొరియాలో రెడ్ లిప్‌స్టిక్‌పై నిషేధం

Read Time:  1 min
North Korea: నార్త్ కొరియాలో రెడ్ లిప్‌స్టిక్‌పై నిషేధం
FONT SIZE
GET APP

మగువలు ఎంత మేకప్‌ వేసుకున్న అదరాలకు లిప్‌స్టిక్ (Lip Stick) అద్దకుంటే అలంకరణ పూర్తి కాదు. లిప్‌స్టిక్ అందం, ఆత్మవిశ్వాసానికి చిహ్నంగా భావిస్తారు. ప్రస్తుతం మార్కెట్లో అనేక రకాల లిప్‌స్టిక్‌లు అందుబాటులో ఉన్నాయి. లిప్‌స్టిక్ వివిధ రంగులలో కూడా లభిస్తుంటాయి. అయితే లిప్‌స్టిక్ ధర మాత్రం బ్రాండ్ ప్రకారం మారుతుంది. ప్రపంచవ్యాప్తంగా రెడ్‌ లిప్‌స్టిక్‌ ఉపయోగించే మహిళల సంఖ్య ఎక్కువట. కానీ ఇప్పుడు ఇదే ఎరుపు లిప్‌స్టిక్ మహిళలకు సమస్యగా మారింది.

Read Also: Bangladesh: 17 ఏళ్ల బహిష్కరణ తర్వాత తారిక్ స్వదేశానికి తిరిగివచ్చారు

Red lipstick banned in North Korea
Red lipstick banned in North Korea

లేత రంగు లిప్‌స్టిక్‌లను మాత్రమే వాడాలి

ఉత్తర కొరియా (North Korea) లో మహిళలు ఎరుపు రంగు లిప్‌స్టిక్‌ను ధరించడంపై అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ నిషేధం విధించారు. దీనిని పాశ్చాత్య సంస్కృతి, పెట్టుబడిదారీ విధానానికి చిహ్నంగా భావిస్తూ, యువతలో వ్యక్తివాదాన్ని పెంచుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. దేశం సంక్షోభాన్ని ఎదుర్కోవచ్చని భావిస్తూ, ఉత్తర కొరియా (North Korea) మహిళలు తమ దేశంలో తయారైన లేత రంగు లిప్‌స్టిక్‌లను మాత్రమే వాడాలని ఆదేశించారు. ఆడంబరమైన మేకప్ నిబంధనలకు విరుద్ధమని, ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటారని తెలుస్తోంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Anusha

రచయిత గురించి

Anusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.