📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన నేటి నుంచే సోషల్ మీడియా వెట్టింగ్ బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన నేటి నుంచే సోషల్ మీడియా వెట్టింగ్ బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ

RCB: తమపై నమోదైన కేసును కొట్టివేయాలి: హైకోర్టులో ఆర్సీబీ పిటిషన్

Author Icon By Shobha Rani
Updated: June 9, 2025 • 3:35 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఐపీఎల్ (Ipl) విజయోత్సవాల సందర్భంగా చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాటలో 11 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటనలో తమపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చేయాలని కోరుతూ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) (ఆర్సీబీ) యాజమాన్యం కర్ణాటక హైకోర్టు(Hi court) ను ఆశ్రయించింది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద ఐపీఎల్ విజయోత్సవాల సందర్భంగా చోటుచేసుకున్న తొక్కిసలాట ఘటనలో తమపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేయాలని కోరుతూ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) (RCB) యాజమాన్యం కర్ణాటక హైకోర్టును ఆశ్రయించింది. తమను ఈ కేసులో తప్పుగా ఇరికించారని ఆర్సీబీ, రాయల్ ఛాలెంజర్స్ స్పోర్ట్స్ లిమిటెడ్ (ఆర్‌సీఎస్‌ఎల్) తరఫు న్యాయవాది కోర్టుకు విన్నవించారు. తమపై దాఖలైన కేసును రద్దు చేయాలని న్యాయస్థానాన్ని అభ్యర్థించారు. ఆర్సీబీతో పాటు, ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన డీఎన్‌ఏ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ కూడా తమపై నమోదైన కేసుకు వ్యతిరేకంగా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.

RCB: తమపై నమోదైన కేసును కొట్టివేయాలి: హైకోర్టులో ఆర్సీబీ పిటిషన్

తప్పుడు ఆరోపణలపై ఆర్సీబీ వాదనలు
ఐపీఎల్‌లో ఆర్సీబీ విజయం సాధించిన అనంతరం చిన్నస్వామి స్టేడియం వద్ద ఏర్పాటు చేసిన సంబరాల్లో అధిక సంఖ్యలో అభిమానులు పాల్గొన్నారు. ఈ క్రమంలో జరిగిన తొక్కిసలాట పెను విషాదానికి దారితీసింది. ఈ ఘటనలో 11 మంది మృతి చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ దుర్ఘటనపై సమాచార హక్కు కార్యకర్త స్నేహమయి కృష్ణ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కబ్బన్ పార్క్ పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఆర్సీబీ (RCB) యాజమాన్యం, ఈవెంట్ మేనేజ్‌మెంట్ సంస్థ డీఎన్‌ఏ ఎంటర్‌టైన్‌మెంట్ నెట్‌వర్క్స్, కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ (కేఎస్‌సీఏ) సహా తొక్కిసలాటకు సంబంధం ఉన్నట్లు భావిస్తున్న పలువురిపై కేసు నమోదు చేసినట్లు సమాచారం. విజయోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించిన డీఎన్‌ఏ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ కూడా తమపై నమోదైన కేసు సరైనదికాదని పేర్కొంటూ, హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ప్రస్తుతం హైకోర్టు ముందు ఈ అంశం విచారణలో ఉంది. కేసు కొనసాగుతున్న నేపథ్యంలో హైకోర్టు ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేస్తుందా లేదా అన్నది కీలక అంశంగా మారింది.

Read Also: Rinku Singh: నిశ్చితార్థం వేడుక‌లో రింకూ-ప్రియా అదరగొట్టిన డ్యాన్స్

Breaking News in Telugu Google news Paper Telugu News quash case against them RCB petitions High Court to Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.