📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

News Telugu: Rayalaseema: సమాజం రుణం తీర్చుకోవడం మన బాధ్యత : గవర్నర్ అబ్దుల్ నజీర్

Author Icon By Rajitha
Updated: November 13, 2025 • 12:34 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Rayalaseema: కర్నూలు: అందరినీ ఉన్నతంగా తీర్చిదిద్దిన విద్యాసంస్థకు, సమాజానికి ఋణం తీర్చుకోవడం మీ అందరి ప్రాథమిక కర్తవ్యం, బాధ్యత, అది మీకు కూడా ఎంతో సంతృప్తిని ఇస్తుందంటూ రాయలసీమ విశ్వవిద్యాలయ నాల్గవ స్నాతకోత్సవంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ మరియు విశ్వ విద్యాలయ ఛాన్సలర్ శ్రీ ఎస్. అబ్దుల్ నజీర్ (Abdul nazeer) తెలుగుభాషలో ఆకాంక్షించారు. వివిధ కోర్సుల్లో ఉత్తీర్ణత సాధించి డిగ్రీలు స్వీకరిస్తున్న విద్యార్థులంతా తాము ఎంచుకున్న రంగాల్లో ఉన్నత శిఖరాలకు చేరాలని ఆయన ఆకాంక్షించారు. విశ్వవిద్యాలయానికి చేరుకున్న వెంటనే ఎన్ సి సి విద్యార్థులనుండి గవర్నర్ గౌరవందనం స్వీకరించారు. స్నాతకోత్సవ వేడుకలను ప్రారంభించారు. ముందుగా వర్సిటీ వైస్ ఛాన్సలర్ ఆచార్య వి. వెంకట బసవరావు వర్సిటీ ప్రగతి నివేదికను వివరించారు.

Read also: AP: భాగస్వామ్య సదస్సుకు విశాఖ రెడీ

Rayalaseema: సమాజం రుణం తీర్చుకోవడం మన బాధ్యత : గవర్నర్ అబ్దుల్ నజీర్

Rayalaseema: వర్సిటీలో అందుబాటులో ఉన్న సౌకర్యాలను, జరుగుతున్న పరిశోధనలను తెలియజేశారు. అనంతరం రాయలసీమ విశ్వవిద్యాలయం ఏర్పాటైన తర్వాత తొలిసారిగా విశ్వ విద్యాలయానికి గవర్నర్ స్వయంగా రావడం వర్సిటీకి, విద్యార్థిలోకానికి ఎంతో సంతోష దాయకమని హర్షం వ్యక్తంచేశారు. అనంతరం ఎ.ఎం. గ్రీన్ ఛీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ మరియు ఎగ్జిక్యూటివ్, వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ ఎస్.ఎస్.వి. రామ కుమార్ కు గవర్నర్ గౌరవ డాక్టరేట్ పట్టాను ప్రదానం చేశారు. అనంతరం స్నాతకోపన్యాసం చేసిన డాక్టర్ యస్ యస్ వి రామ్ కుమార్, శాస్త్ర సాంకేతిక రంగాలతోపాటు విద్యుత్ రంగంలో తాను చేస్తున్న కృషికి గుర్తింపుగా తనను గౌరవించిన రాయలసీమ విశ్వవిద్యాల యానికి ధన్యవాదాలు తెలియజేశారు.

బంగారు పతకాలతోపాటు

స్టార్టప్స్ రంగంలో దేశం ప్రగతిపథంలో దూసుకుపోతోందన్నారు. దేశ ప్రగతి రథానికి విద్యార్థులంతా చోదకశక్తిగా మారాల్సిన అవసరముందని ఆయన సూచించారు. అనంతరం వర్సిటీలో వివిధ కోర్సులు పూర్తిచేసుకున్న విద్యార్థులకు గవర్నర్ బంగారు పతకాలు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ప్రసంగించిన గవర్నర్ నాణ్యమైన బోధన, పరిశోధనలద్వారా రాయలసీమ యూనివర్సిటీ విద్యార్థుల భవితకు బాటలు వేయడం సంతోషకరమన్నారు. ఈ సందర్భంగా బంగారు పతకాలతోపాటు వివిధ పీజీ పి హెచ్ డి కోర్సులు పూర్తిచేసుకున్న విద్యార్థులకు డిగ్రీ ప్రదానం చేయడం సంతోషకరమన్నారు. ఆయా డిగ్రీలద్వారా సంపాదించుకున్న జ్ఞానంతో సార్ధకమైన జీవితాన్ని గడపవలసినదిగా ఆయన హితబోధ చేశారు.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటం కంప్యూటింగ్ వంటి ఆధునిక విషయాల్లో కూడా విద్యార్థులు తమతమ నైపుణ్యాలకు మెరుగులు దిద్దుకున్నపుడు భవితకు ఢాకా ఉండదన్నారు. స్వాతంత్య్రం సిద్ధించి 100 సంవత్సరాలు పూర్తయ్యే 2047 నాటికి దేశాన్ని ప్రగతి పథంలో నిలపాలన్న దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఆశిస్తున్న ఆశయాలకు నూతన విద్యా విధానం తోడ్పాటును అందిస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వ వికసిత్ భారత్ లక్ష్యాలతోపాటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వికసిత్ ఆంధ్ర లక్ష్యాలను చేరుకోవడానికి విద్యార్థిలోకం కృషి చేయాలన్నారు. ఉన్నత విద్య వరకు సమాజం నుండి ఎన్నో పొందిన ప్రతి ఒక్క విద్యార్థి తనదైన బాధ్యతగా సమాజానికి ఉపకరించే పనులు చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

అనంతరం రాయలసీమ యూనివర్సిటీ పక్షాన వి.సి. ఆచార్య వి. వెంకట బసవరావు, రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మెన్ ఆచార్య మధుమూర్తి, వర్సిటీ రెక్టార్ ఆచార్య ఎన్.టి.కె. నాయక్, వర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ బి. విజయ కుమార్ నాయుడు గవర్నర్ను సన్మానించారు. తర్వాత వివిధ కోర్సుల్లో పి.జి. మరియు పి హెచ్ డి పూర్తిచేసుకున్న విద్యార్థులకు పట్టాలను ప్రదానం చేశారు. జాతీయ గీతాలాపనతో స్నాతకోత్సవం ముగిసింది. ఈ కార్యక్రమంలో పార్లమెంట్ సభ్యులు బస్తిపాటి నాగరాజు, కర్నూలు కలెక్టర్ డాక్టర్. ఎ. సిరి, ఎస్.పి. విక్రాంత్ పాటిల్, కోడుమూరు శాసన సభ్యులు బొగ్గుల దస్తగిరి, ఎ పి ఎస్ హెచ్ సి చైర్మన్ ఆచార్య మధుమూర్తి, వర్సిటీ రెక్టార్ ఆచార్య ఎన్.టి.కె. నాయక్ ఉన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

AndhraPradesh EducationNews latest news Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.