అంతర్జాతీయ మార్కెట్లలో అమ్మకాల ఒత్తిడి తగ్గిన తరువాత బంగారం ధరలు పుంజుకోవడంతో.. ప్రముఖ పెట్టుబడిదారుడు రే డాలియో(Ray Dalio) మరోసారి బంగారం మీద పలు కీలక సూచనలు చేశారు. డబ్బును నిల్వ చేసుకోవడానికి బంగారం అత్యుత్తమ ప్రదేశమని ఆయన తెలిపారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని దుబాయ్‌లో జరిగిన వరల్డ్ గవర్నమెంట్స్ సమ్మిట్ సందర్భంగా CNBCతో మాట్లాడుతూ.. బంగారం ప్రధాన బలమేమిటంటే అది రోజురోజుకూ మారిపోని విలువ కలిగి ఉండటమేనని డాలియో పేర్కొన్నారు. బంగారం ధరలు ఇటీవలి కాలంలో చారిత్రాత్మక స్థాయిలో అమ్మకాలను ఎదుర్కొన్న నేపథ్యంలో డాలియో వ్యాఖ్యలు రావడం గమనార్హం. గత వారం గరిష్ట స్థాయిల నుంచి ధరలు తగ్గినప్పటికీ, దీన్ని చూసి పెట్టుబడిదారులు గందరగోళానికి లోనవ్వకూడదని ఆయన సూచించారు. గత ఏడాది కాలంలో Gold ధరలు దాదాపు 65 శాతం పెరిగాయి. అయితే గరిష్ట స్థాయిల నుంచి సుమారు 16 శాతం తగ్గాయి.
Read Also: Hyderabad silver rate today: కుప్పకూలిన వెండి ధరలు.. లేటెస్ట్ రేట్లు ఇవే!
ఇంకా పెరుగుతుందా? తగ్గుతుందా?
ఇలాంటి సందర్భాల్లో ప్రజలు ‘ఇది ఇంకా పెరుగుతుందా? తగ్గుతుందా? ఇప్పుడే కొనాలా?’ అనే ప్రశ్నలపై ఎక్కువగా దృష్టి పెడతారు. ఇదే వారు చేసే ప్రధాన పొరపాటు” అని రే డాలియో వ్యాఖ్యానించారు. బంగారాన్ని ఒక ట్రేడింగ్ సాధనంగా కాకుండా.. పోర్ట్‌ఫోలియోలో భాగంగా చూడాలని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యంగా కేంద్ర బ్యాంకులు, ప్రభుత్వాలు, సావరిన్ వెల్త్ ఫండ్‌లు Gold కొనాలా వద్దా అనే ప్రశ్నకు బదులుగా.. తమ మొత్తం పెట్టుబడుల్లో ఎంత శాతం బంగారానికి కేటాయించాలో నిర్ణయించుకోవాలని సూచించారు. ఒక నిర్దిష్ట శాతాన్ని స్థిరంగా ఉంచుకోవడం ద్వారా, పోర్ట్‌ఫోలియోలోని ఇతర బలహీనమైన ఆస్తుల నుంచి వచ్చే ప్రమాదాన్ని బంగారం సమర్థంగా తగ్గిస్తుందని ఆయన అన్నారు. బంగారం అత్యంత ప్రభావవంతమైన వైవిధ్యభరిత పెట్టుబడి. చెడు సమయాల్లో ఇది ప్రత్యేకంగా బాగా పనిచేస్తుంది. మంచి సమయాల్లో అంతగా రాబడి ఇవ్వకపోవచ్చు. కానీ మొత్తం పోర్ట్‌ఫోలియో స్థిరత్వానికి ఇది కీలకమని డాలియో వివరించారు. అందుకే, పెట్టుబడిదారులు ప్రధానంగా బాగా వైవిధ్యభరితమైన పోర్ట్‌ఫోలియో నిర్మాణంపై దృష్టి పెట్టాలని ఆయన సలహా ఇచ్చారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: