📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Pakistan: మాజీ స్టార్ క్రికెటర్ కుమారుడిపై రేప్ కేసు

Author Icon By Vanipushpa
Updated: January 26, 2026 • 5:16 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

పాకిస్థాన్ క్రికెట్ (Cricket) చరిత్రలో లెగ్ స్పిన్ మాంత్రికుడిగా పేరొందిన మాజీ క్రికెటర్ అబ్దుల్ ఖాదిర్ కుమారుడు సల్మాన్ ఖాదిర్ తీవ్ర ఆరోపణలు వచ్చాయి. ఓ మహిళపై అతడు లైంగిక దాడికి పాల్పడినట్టు ఆరోపణలు సంచలనం రేపుతున్నాయి. లాహోర్‌లోని బార్కీ పోలీస్ స్టేషన్‌లో ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదయింది. సల్మాన్ ను అరెస్ట్ చేసిన పోలీసుల విచారణ చేపట్టారు. సల్మాన్ ఇంట్లో పనిచేసే డొమెస్టిక్ వర్కర్ ఫిర్యాదు మేరకు ఈ చర్యలు తీసుకున్నారు. సల్మాన్ తనను బలవంతంగా ఫాంహౌస్‌కు తీసుకెళ్లి బలాత్కారం చేశాడని ఆమె ఆరోపించింది.

Read Also: Delhi: శుభాంశు శుక్లాకు అశోక చక్ర ప్రదానం చేసిన రాష్ట్రపతి

Pakistan: మాజీ స్టార్ క్రికెటర్ కుమారుడిపై రేప్ కేసు

సల్మాన్‌ను అదుపులోకి తీసుకుని విచారణ

పాకిస్థాన్ పీనల్ కోడ్ (పీపీసీ) సెక్షన్ 376 కింద కేసు నమోదు చేసిన పోలీసులు, సల్మాన్‌ను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. సల్మాన్ తనను బెదిరించి, ఫాంహౌస్‌కు తీసుకెళ్లి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని బాధితురాలు తన ఫిర్యాదులో వివరించింది. ఈ ఘటన జనవరి 25న జరిగినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. పోలీసులు ఫాంహౌస్‌ను సీజ్ చేసి, ఆధారాలు సేకరిస్తున్నారు. అబ్దుల్ ఖాదిర్ పాకిస్థాన్ క్రికెట్‌లో లెగ్ స్పిన్ దిగ్గజంగా పేరొందారు. 67 టెస్టులు, 104 వన్డేలు ఆడి, 236 టెస్ట్ వికెట్లు, 132 వన్డే వికెట్లు పడగొట్టారు. ఇమ్రాన్ ఖాన్ నాయకత్వంలో 1992 వరల్డ్ కప్ జట్టులో కీలక సభ్యుడు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

celebrity family controversy Crime News former cricketer son Law and order legal case police investigation Rape case sexual assault allegations Telugu News online

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.