Rangrez: పాకిస్తానీయుల దాడులతో 16 ఏళ్ల ఇండియన్ రెస్టారెంట్ మూత

Read Time:  1 min
Rangrez
Rangrez
FONT SIZE
GET APP

Rangrez: లండన్ హామర్‌స్మిత్ ప్రాంతంలో 16 సంవత్సరాలుగా కొనసాగుతున్న ‘రంగ్రేజ్’ అనే ఇండియన్ రెస్టారెంట్ వచ్చే నెలలో మూతపడనుంది. రెస్టారెంట్ యజమాని హర్మాన్ సింగ్ కపూర్, పాకిస్తానీయులు మరియు తీవ్రవాదుల నుంచి వస్తున్న బెదిరింపులు, దాడులే ఈ నిర్ణయానికి కారణమని ఆరోపించారు.

Read Also: Basara IIIT Student Suicide: బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థిని సూసైడ్

Rangrez
Rangrez: 16-year-old Indian restaurant closed after attacks by Pakistanis

సోషల్ మీడియాలో వేధింపులు ఎదుర్కొంటున్నట్లు, పోలీసుల నుంచి సరైన భద్రత లభించట్లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఖలిస్తాన్ ఉద్యమంపై విమర్శిస్తూ వీడియోలు విడుదల చేసిన తర్వాత తన రెస్టారెంట్‌పై దాడి జరిగినట్లు గతంలోనే ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. తన వ్యాపారాన్ని దెబ్బతీయవచ్చుగానీ, తన మనోధైర్యాన్ని మాత్రం ఎవరూ కూల్చలేరని కపూర్ స్పష్టం చేశారు. అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడుతూ తిరిగి బలంగా నిలబడతానని ఆయన ప్రకటించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Pooja

రచయిత గురించి

Pooja

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.