📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Rameshan Chandrasen: బంగ్లాదేశ్‌లో హిందూ నేత జైల్లో మృతి

Author Icon By Pooja
Updated: February 9, 2026 • 12:37 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

బంగ్లాదేశ్‌లో హిందూ మైనార్టీలపై వివక్ష ఆరోపణలు కొనసాగుతున్న నేపథ్యంలో మరో హిందూ రాజకీయ నేత మరణం చర్చనీయాంశంగా మారింది. అవామీ లీగ్‌కు చెందిన మాజీ నాయకుడు రమేషన్ చంద్రసేన్‌(Rameshan Chandrasen) (86) జైల్లోనే మరణించినట్లు సమాచారం. విద్యావేత్తగా గుర్తింపు పొందిన ఆయన గతంలో ఎంపీగా, మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వహించారు.

Read Also:Operation Sindoor: ఉగ్ర స్థావరాలపై భారత్ ప్రతీకార దాడులు

18 నెలల క్రితం ఓ అల్లరిమూక ఆయనపై దాడి చేసింది.  అయినప్పటికీ పోలీసులు చంద్రసేన్‌నే అరెస్టు చేశారు. అరెస్టు చేయడానికి గల కారణాలు కూడా సరిగ్గా చెప్పలేదు. దీంతో అప్పటినుంచి ఆయన జైల్లోనే ఉంటున్నారు. పలుమార్లు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించినా అనుమతి(Rameshan Chandrasen) లభించలేదు. చివరకు ఆరోగ్యం విషమించి జైల్లోనే ప్రాణాలు కోల్పోయారు. ఆరోగ్య సమస్యలు ఉన్నప్పటికీ విడుదల చేయకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

చంద్రసేన్‌పై దాడి జరిగిన ఘటనలో బాధితుడైనప్పటికీ ఆయనే అరెస్టయ్యారని ఆరోపణలు ఉన్నాయి. అనంతరం ఒక కేసు తర్వాత మరో కేసు నమోదు చేస్తూ ఆయనను విడుదల కాకుండా ఉంచారని సమాచారం. ఇదే సమయంలో ఇటీవల మరో అవామీ లీగ్ హిందూ నేత ప్రళయ చాకీ కూడా పోలీస్ కస్టడీలో మృతి చెందిన ఘటన వివాదాస్పదమైంది.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

AwamiLeague Google News in Telugu HinduMinorities Latest News in Telugu

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.