📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన

Rahul Gandhi: రాహుల్ పర్యటన – చర్చనీయాంశమైన VIP మరుగుదొడ్డి ఘటన

Author Icon By Shobha Rani
Updated: June 7, 2025 • 1:05 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ (Rahul Gandhi) నిన్న బీహార్‌లోని గయ జిల్లా గెహ్లార్ గ్రామాన్ని సందర్శించారు. ‘మౌంటెన్ మ్యాన్’ గా పేరుగాంచిన దశరథ్ మాంఝీ కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. మౌంట్‌టెన్ మ్యాన్‌గా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన మాంఝీ స్ఫూర్తిని ప్రజల మధ్యకి తీసుకురావాలన్న ఉద్దేశ్యంతో పర్యటన చేపట్టినట్టు విశ్లేషకుల అభిప్రాయం. అయితే, ఈ పర్యటన సందర్భంగా జరిగిన ఓ సంఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రాహుల్ గాంధీ (Rahul Gandhi), అధికారుల కోసం కేవలం రెండు గంటల్లో మాంఝీ ఇంటి బయట ఓ వీఐపీ మరుగుదొడ్డిని నిర్మించారు. అయితే, ఆయన వెళ్లిపోగానే దాన్ని కూలగొట్టారు. రాహుల్ గాంధీ (Rahul Gandhi) పర్యటనకు ముందు రాష్ట్ర ప్రభుత్వం చకచకా ఏర్పాట్లు చేసింది. ఇందులో భాగంగా దశరథ్ మాంఝీ మట్టి ఇంటి వెలుపల ఓ అత్యవసర వీఐపీ మరుగుదొడ్డిని నిర్మించారు. కేవలం రెండు గంటల్లోనే ఇది సిద్ధమైంది. అయితే, రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఆ గ్రామం నుంచి తిరిగి వెళ్లిన వెంటనే అధికారులు ఆ మరుగుదొడ్డిని తొలగించారు. ఈ ఘటనపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. చారిత్రక నేపథ్యం ఉన్న మాంఝీ కుటుంబానికి శాశ్వత మరుగుదొడ్డి సౌకర్యం కల్పించడంలో విఫలమైన ప్రభుత్వం, నేతల పర్యటనల కోసం తాత్కాలిక హంగులు చేయడంపై పలువురు ప్రశ్నలు లేవనెత్తారు.

Rahul Gandhi: రాహుల్ పర్యటన – చర్చనీయాంశమైన VIP మరుగుదొడ్డి ఘటన

రాహుల్ ముందు రెండు ప్రధాన డిమాండ్లు

దశరథ్ మాంఝీ మనవరాలు అన్షు కుమారి తమ కుటుంబం ఎదుర్కొంటున్న దుస్థితిని వివరించారు. 2015లో ప్రభుత్వం నిర్మించిన మరుగుదొడ్డిని రోడ్డు నిర్మాణం కోసం కూల్చివేశారని, అప్పటి నుంచి గత పదేళ్లుగా తమకు మరుగుదొడ్డి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ (Rahul Gandhi) పర్యటన సందర్భంగా మాంఝీ కుమారుడు భగీరథ్ మాంఝీ రెండు ప్రధాన డిమాండ్లను ఆయన ముందుంచారు. ప్రస్తుతం తాము నివసిస్తున్న మట్టి ఇంటి స్థానంలో పక్కా ఇల్లు నిర్మించాలని, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బోధ్ గయ స్థానం నుంచి పోటీ చేసేందుకు అన్షు కుమారికి కాంగ్రెస్ పార్టీ టికెట్ కేటాయించాలని వారు కోరారు.

కాంగ్రెస్ వ్యూహాత్మక పర్యటన

మాంఝీ కుటుంబ సభ్యులు చెప్పిన సమస్యలను రాహుల్ గాంధీ (Rahul Gandhi) సావధానంగా విన్నారు. వారి విజ్ఞప్తులను పార్టీ పరిశీలిస్తుందని హామీ ఇచ్చారు. బీహార్‌లో దళిత వర్గాలతో సంబంధాలను బలోపేతం చేసుకునేందుకు కాంగ్రెస్ పార్టీ పక్కా ప్రణాళికతోనే ఈ పర్యటన చేపట్టిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. తన గ్రామానికి అభివృద్ధి ఫలాలు అందించేందుకు కొండను ఒంటి చేత్తో తొలిచి రహదారి నిర్మించిన దశరథ్ మాంఝీ స్ఫూర్తిని, ఆయన ప్రతీకను రాజకీయంగా వాడుకునే ప్రయత్నంగా దీనిని చూస్తున్నారు. ఇలాంటి ఘటనలు కేవలం చర్చలకే పరిమితమవకుండా, ప్రభుత్వాలు ప్రత్యక్ష చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Read Also: David Huerta: లాస్ ఏంజెలెస్‌లో వలసదారులపై ఐస్ దాడులు!

Breaking News in Telugu Google News in Telugu Latest News in Telugu Rahul's visit – Telugu News online Telugu News Paper Telugu News Today the controversial VIP toilet incident

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.