📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Latest Telugu News : Rahul Gandhi : ట్రంప్‌ను చూసి మోదీ భయపడ్డారు : రాహుల్‌ గాంధీ

Author Icon By Sudha
Updated: October 16, 2025 • 3:38 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

రష్యా నుంచి భారత్‌ చమురు కొనుగోళ్లపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఇకపై రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేయదని.. ఈ మేరకు ప్రధాని మోదీ తనకు హామీ ఇచ్చారని ట్రంప్‌ చెప్పారు. ట్రంప్‌ వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ అగ్రనేత, లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) తాజాగా స్పందించారు. ఈ మేరకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై విరుచుకుపడ్డారు. ట్రంప్‌ను చూసి మోదీ భయపడ్డారని ఎద్దేవా చేశారు. ఈ మేరకు పలు ప్రశ్నలు సంధిస్తూ ఎక్స్‌ వేదికగా పోస్టు పెట్టారు.

Rahul Gandhi : ట్రంప్‌ను చూసి మోదీ భయపడ్డారు : రాహుల్‌ గాంధీ

‘అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు ప్రధాని మోదీ భయపడుతున్నారు. రష్యా చమురు కొనుగోళ్లపై ట్రంప్ ప్రకటన చేసేందుకు ప్రధాని అనుమతించారు. అమెరికా పదేపదే తిడుతున్నా కూడా అవేవీ పట్టించుకోకుండా వారిని అభినందిస్తూ శుభాకాంక్షల మెసేజీలు పంపుతూనే ఉన్నారు. ఆర్థికమంత్రి అమెరికా పర్యటనను రద్దు చేశారు. ఈజిప్టులోని షర్మ్-ఎల్ షేక్‌లో సోమవారం జరిగిన గాజా శాంతి ఒప్పందం కార్యక్రమానికి ప్రధాని వెళ్లలేదు. ఆపరేషన్ సిందూర్‌పై ట్రంప్ ప్రకటనలను ఖండించట్లేదు’ అని రాహుల్‌ (Rahul Gandhi)తన ట్వీట్‌లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్‌ వైరల్‌ అవుతోంది.

2019 ఎన్నికల్లో రాహుల్ గాంధీ గెలిచారా?

2014 మరియు 2019 సార్వత్రిక ఎన్నికలలో గాంధీ కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం వహించారు, అక్కడ పార్టీ వరుసగా 44 మరియు 52 సీట్లను గెలుచుకుని గణనీయమైన పరాజయాలను చవిచూసింది.

భారత్ జోడో యాత్ర నేపథ్యం?

కాంగ్రెస్ పార్టీ 2022 ఆగస్టు 23న ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో ”భారత్ జోడో యాత్ర” లోగో, ట్యాగ్‌లైన్, వెబ్‌సైట్‌ను ప్రారంభించింది. ఐదు నెలల్లో 12 రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లో 3,570 కిలోమీటర్ల పొడవున ఉదయం 7 గంటల నుంచి 10.30 గంటల వరకు, మధ్యాహ్నం 3.30 నుంచి సాయంత్రం 6.30 గంటల వరకు రెండు విడతలుగా ప్రతిరోజూ 22-23 కి.మీ పాదయాత్ర సాగుతోంది.[4] కాంగ్రెస్ ‘భారత్ జోడో యాత్ర’, 1983లో భారత మాజీ ప్రధాని చంద్రశేఖర్ దాదాపు 4,260 కి.మీల భారత్ యాత్ర మధ్య అనేక సమాంతరాలు ఉన్నాయి.

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

Breaking News Donald Trump Indian Politics latest news Modi Trump Meeting Narendra Modi rahul gandhi TeluguNews

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.