📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ట్రంప్ ప్రకటనలో భారీగా తగ్గనున్న మందుల ధర ఢాకాలో హింస.. పత్రికల కార్యాలయాలపై దాడులు కుప్పకూలిన విమానం.. ప్రముఖ రేసర్ కన్నుమూత బంగ్లాదేశ్ లో దారుణం ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం ట్రంప్ ప్రకటనలో భారీగా తగ్గనున్న మందుల ధర ఢాకాలో హింస.. పత్రికల కార్యాలయాలపై దాడులు కుప్పకూలిన విమానం.. ప్రముఖ రేసర్ కన్నుమూత బంగ్లాదేశ్ లో దారుణం ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం

RAB investigation: బంగ్లాదేశ్‌లో హిందూ యువకుడి హత్యపై షాకింగ్ నిజాలు

Author Icon By Pooja
Updated: December 21, 2025 • 11:32 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

బంగ్లాదేశ్‌లో ఇటీవల మత విద్వేషాన్ని ఆధారంగా చేసుకుని జరిగిన ఓ హిందూ యువకుడి హత్య దేశంలోనే కాకుండా అంతర్జాతీయంగా తీవ్ర కలకలం రేపుతోంది. అయితే ఈ ఘటనకు కారణంగా ప్రచారం చేసిన ‘మత దూషణ’ ఆరోపణల్లో (RAB investigation)ఎలాంటి నిజం లేదని ప్రాథమిక విచారణలో తేలడం మరింత సంచలనంగా మారింది.

Read Also: Osman Hadi: బంగ్లాదేశ్ రాజకీయాలను కుదిపేసిన షరీఫ్ ఉస్మాన్ హాదీ మరణం

Shocking truths emerge about the murder of a Hindu youth in Bangladesh.

డిసెంబర్ 18 రాత్రి మైమెన్‌సింగ్ ప్రాంతంలో దీపు చంద్రదాస్ అనే హిందూ యువకుడిని ఉన్మాద గుంపు అత్యంత అమానుషంగా కొట్టి హతమార్చింది. ఇస్లాం మతాన్ని అవమానించాడంటూ అతడి ఫ్యాక్టరీలో పనిచేసే ఓ సహోద్యోగి చేసిన ఆరోపణలతో ఈ హింస మొదలైనట్లు పోలీసులు తెలిపారు. ఆవేశంతో రెచ్చిపోయిన మూక దీపును హత్య చేసి, మృతదేహాన్ని చెట్టుకు వేలాడదీసి నిప్పంటించిన ఘటన అందరినీ విస్మయానికి గురిచేసింది.

ఈ ఘటనపై బంగ్లాదేశ్ ప్రముఖ పత్రిక ‘ది డైలీ స్టార్’కు వివరాలు వెల్లడించిన రాబ్-14 (RAB-14) కంపెనీ కమాండర్ మహ్మద్ సంసుజ్జమాన్, కీలక విషయాలను బయటపెట్టారు. దీపు చంద్రదాస్ తన సోషల్ మీడియా ఖాతాల్లో ఎక్కడా మతపరమైన భావాలను కించపరిచే పోస్టులు చేయలేదని ఆయన స్పష్టం చేశారు. అలాగే, దీపు మతాన్ని దూషించాడని ప్రత్యక్షంగా విన్నామని చెప్పే ఒక్క వ్యక్తి కూడా లేడని తెలిపారు.

ఫ్యాక్టరీలో గొడవ జరుగుతున్న సమయంలో, ఆస్తి నష్టం జరగకుండా ఉండాలనే ఉద్దేశంతో దీపును బలవంతంగా బయటకు పంపారని, ఆ తర్వాతే పరిస్థితి అదుపు తప్పి ఈ ఘోర ఘటన చోటుచేసుకుందని అధికారులు వెల్లడించారు.

ఈ హత్యకు సంబంధించిన వీడియోలు సోషల్(RAB investigation) మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు వేగంగా స్పందించారు. ఇప్పటివరకు ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారించగా, వారి సమాచారం ఆధారంగా మరో ఐదుగురిని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం మొత్తం 10 మందిని విచారిస్తున్నట్లు ఏఎస్పీ మహ్మద్ అబ్దుల్లా అల్ మామున్ తెలిపారు.

అంతర్జాతీయ మౌనంపై విమర్శలు

ఈ ఘటనపై ఉత్తర అమెరికా హిందూ కూటమి (CoHNA) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
“బంగ్లాదేశ్ క్రమంగా ఆటవిక పాలన వైపు వెళ్తోంది. హిందువులపై ఇలాంటి దారుణ హింస జరుగుతున్నా అంతర్జాతీయ మీడియా, ప్రపంచ దేశాలు మౌనంగా ఉండటం బాధాకరం” అంటూ ఆ సంస్థ తీవ్ర వ్యాఖ్యలు చేసింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

Bangladesh Violence Google News in Telugu Hindu youth murder Latest News in Telugu religious hatred

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.