Vladimir Putin: ఇరాన్ అత్యున్నత నాయకుడు అయతుల్లా అలీ ఖమేనీ మరణంపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అత్యంత కఠిన పదజాలంతో స్పందించారు. అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా జరిపిన వైమానిక దాడుల్లో ఖమేనీ ప్రాణాలు కోల్పోవడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ దాడులను ‘సినికల్ మర్డర్’ (కిరాతక హత్య) గా అభివర్ణించిన పుతిన్.. ఇది అంతర్జాతీయ చట్టాలను బేఖాతరు చేయడమే కాకుండా, మానవత్వాన్ని పూర్తిగా ఉల్లంఘించడమేనని మండిపడ్డారు.
Read Also: Priyanka Gandhi: ఇది అత్యంత హేయమైన చర్య
ఇరాన్ అధ్యక్షుడికి లేఖ.. ఖమేనీ సేవలు కొనియాడారు
ఈ మేరకు ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్‌కు పుతిన్ ఓ లేఖ రాశారు. ఖమేనీని రష్యాలో అత్యుత్తమ రాజనీతిజ్ఞుడిగా గుర్తుంచుకుంటామని, ఇరు దేశాల సంబంధాల బలోపేతానికి ఆయన ఎంతో కృషి చేశారని ఆ లేఖలో కొనియాడారు. శనివారం జరిగిన ఈ దాడుల్లో ఖమేనీతో పాటు ఆయన కుటుంబ సభ్యులు, పలువురు సీనియర్ సైనిక అధికారులు మరణించినట్లు ఇరాన్ మీడియా ధృవీకరించింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: