రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (Vladimir Putin) ఈ ఏడాది డిసెంబర్ 5-6 తేదీల్లో భారత్ పర్యటనకు రానున్నారు. ప్రతి సంవత్సరం సంప్రదాయంగా జరుగుతున్న ఇండియా-రష్యా వార్షిక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనడం కోసం ఆయన ఈ పర్యటన చేస్తున్నారు. ఈ సమావేశాలు రెండు దేశాల మధ్య వ్యూహాత్మక సంబంధాలను మరింత బలపరచడానికి, కొత్త ఒప్పందాలు కుదుర్చుకోవడానికి ప్రధాన వేదికగా ఉంటాయి.
Internet-అఫ్గానిస్తాన్ లో షట్‌డౌన్ తో స్తంభించిన లావాదేవీలు
ఈ ఉన్నత స్థాయి పర్యటనకు సంబంధించిన తేదీలు కూడా తాజాగా ఖరారైనట్లు సమాచారం. జాతీయ భద్రతా సలహాదారు (NSA) అజిత్ దోవల్ (Ajit Doval) ఇటీవల రష్యా రాజధాని మాస్కోలో పర్యటించారు. ఆ పర్యటన సందర్భంగానే పుతిన్ భారత్ రాక తేదీలను ఖరారు చేస్తున్నట్లు అప్పుడే ఆయన ప్రకటించారు.
పర్యటనకు సంబంధించిన తేదీలు కూడా తాజాగా ఖరారైనట్లు
రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ కూడా పర్యటన ఉంటుందని గత వారం ధ్రువీకరించినప్పటికీ, తేదీలను వెల్లడించలేదు. డిసెంబర్ 5, 6 తేదీల్లో పర్యటన ఉంటుందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, పుతిన్ (Prime Minister Narendra Modi and Putin) లు గత ఏడాది రెండుసార్లు సమావేశమయ్యారు.
జులైలో జరిగిన శిఖరాగ్ర సదస్సులో భాగంగా మోదీ రష్యాకు వెళ్లారు. అక్టోబర్‌లో బ్రిక్స్ సదస్సు సందర్భంగా కజాన్‌లో మరోసారి వీరిద్దరు సమావేశమయ్యారు. ఇటీవల చైనాలో జరిగిన షాంఘై సహకార సంస్థ సదస్సులోనూ పుతిన్-మోదీ భేటీ అయ్యారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: