📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి విదేశీ చదువుల్లో ఏపీ స్టూడెంట్స్ టాప్ సోషల్ వెట్టింగ్ తో భారత్ కు భారీ కుదుపు! భారత్ లో వీసా సర్వీసులను నిలిపేసిన బంగ్లాదేశ్ కూలిన మెక్సికో నేవీ విమానం.. ఐదుగురు దుర్మరణం ఇండోనేషియాలో రోడ్డుప్రమాదం.. 16 మంది దుర్మరణం ట్రంప్ ప్రకటనలో భారీగా తగ్గనున్న మందుల ధర ఢాకాలో హింస.. పత్రికల కార్యాలయాలపై దాడులు కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి విదేశీ చదువుల్లో ఏపీ స్టూడెంట్స్ టాప్ సోషల్ వెట్టింగ్ తో భారత్ కు భారీ కుదుపు! భారత్ లో వీసా సర్వీసులను నిలిపేసిన బంగ్లాదేశ్ కూలిన మెక్సికో నేవీ విమానం.. ఐదుగురు దుర్మరణం ఇండోనేషియాలో రోడ్డుప్రమాదం.. 16 మంది దుర్మరణం ట్రంప్ ప్రకటనలో భారీగా తగ్గనున్న మందుల ధర ఢాకాలో హింస.. పత్రికల కార్యాలయాలపై దాడులు

Latest News: Russia: భారత్ లో పర్యటించనున్న పుతిన్.. కీలక ఒప్పందంపై రష్యా ఆమోదం!

Author Icon By Anusha
Updated: December 3, 2025 • 12:00 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఈ నెల 4న రెండు రోజుల పర్యటన నిమిత్తం భారత్‌ లో రష్యా (Russia) అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ సందర్శించనున్నారు. 23వ వార్షిక శిఖరాగ్ర సదస్సులో వాణిజ్యం, రక్షణ తదితర అంశాలపై రెండు దేశాల అగ్రనేతలు చర్చించనున్నారు. ఈ నేపథ్యంలో ఇరుదేశాల మధ్య పలు కీలక ఒప్పందాలు కుదిరే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం. అయితే రష్యా ఆర్థిక వ్యవస్థ విషయంలో చూసుకుంటే అక్కడ భవన నిర్మాణం, జౌళి, ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో నిపుణుల కొరత ఉంది.

Read Also: Sri Lanka cyclone Ditwah : శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం | డిట్‌వా తుఫాన్ తర్వాత వాలంటీర్ల సేవ…

రష్యా చమురు కొనుగోలు చేస్తోందనే కారణం

ఈ నేపథ్యంలోనే 70 వేల మందికి పైగా భారతీయ కార్మికులకు, నిపుణులకు రష్యాలో ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ విషయంలో ఇరుదేశాల మధ్య ఒప్పందం కుదిరే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే రష్యా చమురు కొనుగోలు చేస్తోందనే కారణంతో భారత్‌పై ఇటీవల అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అదనపు సుంకాలు విధించారు..

ఇలాంటి తరుణంలో పుతిన్‌కు భారత్‌కు రావడం ప్రాధాన్యం సంతరించుకుంది.అయితే రష్యా అధ్యక్షుడు పుతిన్ (Putin) పర్యటనకు ముందే ఆ దేశం కీలక ఒప్పందానికి ఆమోదం తెలిపింది. రెసిప్రొకల్ఎక్స్ఛేంజ్ ఆఫ్ లాజిస్టిక్ సపోర్ట్ (RELOS)ను రష్యా ఆమోదించింది. ఇందులో రష్యా సైనిక నిర్మాణాలు, యుద్ధనౌకలు, సైనిక విమానాలను భారతదేశానికి పంపే విధాన్ని నిర్దేశిస్తుంది.

ఒకరికొకరు సహకారం

ఇరు దేశాల మధ్యనాలాజిస్టికల్ మద్దతును ఈ ఒప్పందం కల్పించనుంది. వీటితో పాటూ సైన్యం తాలూకా శిక్షణ, మానవతా సహాయం, ప్రకృతి, మానవ నిర్మిత విపత్తు సహాయ ప్రయత్నాలలో రష్యా, భారత్.. భవిష్యత్తులో ఒకరికొకరు సహకారం అందించుకోనున్నారు. భారత్ తో మా సంబంధాలు వ్యూహాత్మకమైనవి, సమగ్రమైనవి. మేము వాటిని విలువైనవిగా భావిస్తాము.

ఈరోజు చేసుకున్న ఒప్పందంతో ఇరు దేశాలు పరస్పరం మా సంబంధాల అభివృద్ధి వైపు మరొక అడుగు వేస్తామని తాము అర్ధం చేసుకున్నామని రష్యా స్టేట్ డూమా స్పీకర్ వ్యాచెస్లావ్వోలోడిన్ (Duma Speaker Vyacheslav Volodin) చెప్పారు.

Putin to visit India.. Russia approves key agreement

ఫైటర్ జెట్లను కొనేందుకు భారత్ ఆసక్తి

రష్యా (Russia) డిఫెన్స్ టెక్నాలజీని పొందడం భారత్‌కు వ్యూహాత్మక అవసరం. రష్యా నుంచి ఆయుధాలు కొనడమే కాకుండా.. వాటిని స్వదేశంలోనే తయారుచేసుకోవడం, అలాంటి టెక్నాలజీని రష్యా నుంచి పొందడం భారత్‌కి కీలకం కాబోతోంది. రష్యా నుంచి మరిన్ని ఎస్-400 ఎయిర్ డిఫెన్స్ స్క్వాడ్రన్లు, సుఖోయ్-57 ఫైటర్ జెట్లను కొనేందుకు భారత్ ఆసక్తిగా ఉంది.

వీటన్నిటిపైనా పుతిన్‌-మోదీ మధ్య కీలక చర్చలు జరిగే అవకాశం ఉంది. అమెరికా ఆంక్షలతో ఇంధన రంగంలో సహకారంపై కూడా రెండు దేశాల మధ్య చర్చలు జరగొచ్చు.

ఉమ్మడి ప్రాజెక్టులు చేపట్టడమే ఇరు దేశాల లక్ష్యం

ఇరు దేశాల మధ్యన సహకారాన్ని మరింత పెంపొందించుకోవడానికి రష్యా ఎదురుచూస్తోందని. రష్యా అధ్యక్షుడు పుతిన్ అన్నారు. ఆయిల్, పరిశ్రమలు, స్పేస్, వ్యవసాయం, టెక్నాలజీ వంటి రంగాల్లో ఉమ్మడి ప్రాజెక్టులు చేపట్టడమే ఇరు దేశాల లక్ష్యమని చెప్పారు.

భారత్‌ నుంచి దిగుమతులు మరింత పెంచుకునే అంశం పైన ప్రధాని మోదీతో చర్చలు జరపనున్నట్లు పుతిన్ తెలిపారు. భారత్ కు రష్యా కీలక ఇంధన సరఫరాదారుగా కొనసాగుతుందని అన్నారు. ఇదిలాఉండగా 2021 తర్వాత పుతిన్‌ భారత్‌కు రావడం ఇదే మొదటిసారి.

రష్యా-భారత్ సంబంధాలు ఎప్పటి నుంచి ఉన్నాయి?

రష్యా ,భారత్ మధ్య సంబంధాలు 1947లో భారత స్వాతంత్య్రం, తర్వాత దౌత్య సంబంధాలు, ప్రారంభమయ్యాయి.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

Bilateral Agreements Defense Talks Economic Collaboration latest news Putin India Visit Russia-India Summit Telugu News Trade Discussions

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.