📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Vladimir Putin : మీడియా సమావేశంలో పుతిన్ ఇంగ్లీష్‌లో మాట్లాడిన వైనం

Author Icon By Divya Vani M
Updated: August 17, 2025 • 9:44 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

రష్యా – ఉక్రెయిన్ యుద్ధం గురించి తాజాగా ఆసక్తికరమైన పరిణామం జరిగింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) మూడు గంటల పాటు కీలకంగా చర్చించారు. ఈ చర్చల అనంతరం పుతిన్ మీడియా సమావేశంలో చేసిన విషయం ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది.ట్రంప్‌తో చర్చలు పూర్తైన తరువాత పుతిన్ మీడియా సమావేశానికి వచ్చారు. ఆశ్చర్యం ఏమిటంటే, పుతిన్ అక్కడ రష్యన్ భాష వదిలేసి ఆంగ్లంలో మాట్లాడడం మొదలుపెట్టారు. ఇది ఎవరూ ఊహించని పరిణామం. సాధారణంగా పుతిన్ ప్రభుత్వ కార్యక్రమాల్లో ఎప్పుడూ రష్యన్ భాషనే వాడతారు.పుతిన్ మాట్లాడిన ఆంగ్లం (The English spoken by Putin) నెటిజన్లను ఆకట్టుకుంది. “పుతిన్‌కు ఇంత భాషలు వచ్చా?” అని ప్రశ్నలు వెల్లువెత్తాయి. సామాజిక మాధ్యమాల్లో ఈ ఘటనపై మింఛిన చర్చ జరుగుతోంది. కొందరు ఆయన ఆంగ్లను ప్రశంసించగా, మరికొంతమంది ఆయన అంతర్జాతీయ దృష్టికోణాన్ని గమనించారు.

Vladimir Putin : మీడియా సమావేశంలో పుతిన్ ఇంగ్లీష్‌లో మాట్లాడిన వైనం

ఆంగ్లం వచ్చిందంటే చెప్పుకోవాల్సిందే కానీ.. ఎందుకు వాడరు?

అంతర్జాతీయ మీడియా ప్రకారం, పుతిన్‌కు ఆంగ్ల భాషపై మంచి పట్టు ఉంది. అయినా అధికారికంగా మాట్లాడేటప్పుడు అనువాదకులపై ఆధారపడతారు. ఇది ఆయనకు స్వభావంగా ఉన్న జాగ్రత్తా? లేక వ్యూహమా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.ఒక రష్యా ప్రతినిధి తెలిపిన ప్రకారం, పుతిన్ అంతర్గత చర్చలలో అప్పుడప్పుడూ ఆంగ్లంలోనూ మాట్లాడతారు. కొన్ని సందర్భాల్లో అనువాదకుల పొరపాట్లను కూడా సరిచేస్తారని తెలిపారు. ఇది ఆయన భాషా పరిజ్ఞానానికి నిదర్శనం అని నిపుణులు పేర్కొంటున్నారు.పుతిన్‌కు జర్మన్ భాషపై కూడా మంచి పట్టు ఉందని సమాచారం. ఆయన 1980లలో తూర్పు జర్మనీలో కేజీబీ నిఘా అధికారిగా పనిచేశారు. అదే సమయంలో ఆయన జర్మన్ నేర్చుకున్నారని చెబుతున్నారు. జర్మన్ ఛాన్సలర్‌తో భాష మారకుండా చర్చలు జరిపిన సందర్భాలూ ఉన్నాయి.

ట్రంప్‌తో చర్చల అనంతరం ఎందుకింత భాషా డ్రామా?

ట్రంప్‌తో కీలక చర్చలు ముగిశాక పుతిన్ మీడియా సమావేశంలో సడెన్‌గా ఆంగ్లం మాట్లాడటం వెనక వ్యూహమేనా? ఇది ఆయన అంతర్జాతీయ దృక్పథానికి సంకేతమా? లేక మెసేజ్ పాస్ చేయడానికేనా?ఈ పరిణామం ద్వారా పుతిన్ తన ప్రజ్ఞ, భాషా సామర్థ్యాన్ని ప్రపంచానికి చూపినట్టు నిపుణుల భావన. రాజకీయ నాయకుల్లో ఇలా భాషలతో ఫ్లెక్సిబిలిటీ ఉండటం అరుదు. కానీ ఇది రష్యా భవిష్యత్ దౌత్యంలో కీలక పాత్ర పోషించనుందని భావిస్తున్నారు.

Read Also :

https://vaartha.com/nine-year-old-girl-dies-of-brain-swelling/national/531370/

Brain Putin Putin English Putin German Language Putin Languages Putin Speaking English Exceptionally Russia Ukraine War Trump Putin talks

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.