📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి విదేశీ చదువుల్లో ఏపీ స్టూడెంట్స్ టాప్ సోషల్ వెట్టింగ్ తో భారత్ కు భారీ కుదుపు! భారత్ లో వీసా సర్వీసులను నిలిపేసిన బంగ్లాదేశ్ కూలిన మెక్సికో నేవీ విమానం.. ఐదుగురు దుర్మరణం ఇండోనేషియాలో రోడ్డుప్రమాదం.. 16 మంది దుర్మరణం ట్రంప్ ప్రకటనలో భారీగా తగ్గనున్న మందుల ధర ఢాకాలో హింస.. పత్రికల కార్యాలయాలపై దాడులు కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి విదేశీ చదువుల్లో ఏపీ స్టూడెంట్స్ టాప్ సోషల్ వెట్టింగ్ తో భారత్ కు భారీ కుదుపు! భారత్ లో వీసా సర్వీసులను నిలిపేసిన బంగ్లాదేశ్ కూలిన మెక్సికో నేవీ విమానం.. ఐదుగురు దుర్మరణం ఇండోనేషియాలో రోడ్డుప్రమాదం.. 16 మంది దుర్మరణం ట్రంప్ ప్రకటనలో భారీగా తగ్గనున్న మందుల ధర ఢాకాలో హింస.. పత్రికల కార్యాలయాలపై దాడులు

Latest Telugu News: Russia: ఉక్రెయిన్ కంటే నా దేశ భద్రత ముఖ్యం: పుతిన్

Author Icon By Vanipushpa
Updated: December 5, 2025 • 12:39 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఉక్రెయిన్–రష్యా యుద్ధం, క్రెమ్లిన్ భద్రత, జెలెన్‌స్కీ విధానాలు, నాటో విస్తరణ, శాంతి చర్చలు, అందులో అమెరికా పాత్ర, డొనాల్డ్ ట్రంప్ చొరవ వంటి అంశాలపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (Putin) కీలక వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్ కోసం రష్యా భద్రతను విఘాతం కలిగించే ఎలాంటి పనినైనా ఒప్పుకునే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. రష్యా భద్రతను బలి చేయడం ఎన్నటీకీ తమకు ఆమోదయోగ్యం కాదని అని స్పష్టం చేశారు. భారత పర్యటన వేళ ఆయన జాతీయ మీడియాకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ నాయకత్వంపై పుతిన్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. జెలెన్‌స్కీ అధికారంలోకి వచ్చినప్పుడు శాంతి వాగ్దానాలు చేశారని, ఏది ఏమైనా సరే, తన పదవి పోయినా శాంతి కోసం నిలబడుతానని హామీ ఇచ్చారని పుతిన్ పేర్కొన్నారు.

Read Also: Instant Loan: గోల్డ్ లోన్ vs పర్సనల్ లోన్ – ఏది మంచిది?

Russia

నాటో విస్తరణ విషయం రష్యా భద్రతకు ప్రధాన సమస్య

తూర్పు దేశాల్లో నాటో విస్తరణపై పుతిన్ తీవ్రస్థాయిలో స్పందించారు. నాటో విస్తరణ విషయం రష్యా భద్రతకు ప్రధాన సమస్యగా మారిందన్నారు. ఉక్రెయిన్ సహా ప్రతీ దేశానికి తమ రక్షణ కోసం ఏ మార్గాన్ని ఎంచుకోవాలనే స్వతంత్ర హక్కు ఉందని, దాన్ని రష్యా ఎప్పుడూ వ్యతిరేకించలేదన్నారు. కానీ, ఆ హక్కు ఇతర దేశాలకు హానీ చేసేలా ఉండకూడదన్నారు. ఉక్రెయిన్ భద్రత అంశం రష్యా సెక్యూరిటీకి ముప్పు కలిగించే విధంగా ఉండకూడదని ఆయన అభిప్రాయపడ్డారు. అలా జరిగితే దాన్ని అంగీకరించలేమని పుతిన్ స్పష్టంగా చెప్పారు. నాటో విస్తరణ విషయంలో 1990లలో రష్యాకు కొన్ని హామీలు ఇచ్చారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. నాటో కూటమి తూర్పు వైపు విస్తరించబోమని హామీ ఇచ్చారు. నాటో తూర్పు దిశగా విస్తరించబోమని 1990ల్లో హామీ ఇచ్చారు. కానీ ఆ హామీని పదేపదే తుంగలో తొక్కుతూ వస్తున్నారు”అని పుతిన్ అన్నారు

యుద్ధాన్ని ముగించేందుకు ట్రంప్ చిత్తశుద్ధితో వున్నారు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ యుద్ధాన్ని ముగించేందుకు చిత్తశుద్ధితో ప్రయత్నిస్తున్నారని తాను నమ్ముతున్నట్లు పుతిన్ అన్నారు. ట్రంప్ నష్టాలను తగ్గించాలని కోరుకుంటున్నారని, ఆయన ఉద్దేశాలు నిజాయితీగా ఉన్నాయని చెప్పారు. అమెరికాకు ఈ సమస్యను పరిష్కరించడంలో కొన్ని రాజకీయపరమైన, ఆర్థికపరమైన ప్రయోజనాలు కూడా ఉన్నాయని పుతిన్ ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. అలాగే, రష్యా ఇప్పటికీ చర్చలకు సిద్ధంగానే ఉందని, అయితే, తమ భద్రతకు హాని కలిగించే ఏ షరతులను అంగీకరించబోమని పుతిన్ స్పష్టం చేశారు. ఉక్రెయిన్ మొదట్లో 28 అంశాలతో ఒక శాంతి ప్రణాళికను ఇచ్చిందని, తర్వాత దాన్ని 27 అంశాలుగా మార్చి, నాలుగు ప్యాకేజీలుగా చర్చలకు ప్రతిపాదించిందన్నారు.

పుతిన్ చేసిన మంచి పనులు ఏమిటి?
పుతిన్ అధ్యక్షుడిగా మొదటి రెండు పదవీకాలంలో, 13 శాతం ఫ్లాట్ ఆదాయపు పన్ను, లాభాల పన్ను తగ్గింపు మరియు కొత్త భూమి మరియు పౌర సంకేతాలు వంటి ఉదారవాద ఆర్థిక సంస్కరణల శ్రేణిపై చట్టంగా సంతకం చేశారు. ఈ కాలంలో, రష్యాలో పేదరికం సగానికి పైగా తగ్గింది మరియు వాస్తవ GDP వేగంగా పెరిగింది.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

Breaking News in Telugu Google News in Telugu International Relations Latest In telugu news National Security Russia Security Policy Russia Ukraine Tensions Telugu News Today Ukraine conflict Vladimir Putin

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.