రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (vladimir putin) వచ్చే నెల భారత పర్యటనకు వస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు ఆయన రెండు రోజులపాటు భారత్‌లో పర్యటించనున్నారు. డిసెంబర్ 4, 5 తేదీల్లో జరిగే 23వ భారత–రష్యా వార్షిక సదస్సులో పుతిన్ పాల్గొనడం ఖరారైంది. ఈ సమావేశం సందర్భంగా ఇరు దేశాధినేతలు ద్వైపాక్షిక సంబంధాలు, రక్షణ, వాణిజ్య విస్తరణ, ఇంధన రంగ సహకారం వంటి కీలక అంశాలపై చర్చించనున్నారు.
Read also: Delhi blast: అల్ ఫలా యూనివర్సిటీకి డాక్టర్ షహీన్‌ను తీసుకెళ్లి విచారణ
Russian President Putin to visit India
భారత్–రష్యా సంబంధాలు
ఈ పర్యటనకు ప్రస్తుతం అంతర్జాతీయ పరిణామాల మధ్య ప్రత్యేక ప్రాధాన్యం లభిస్తోంది. రష్యా నుంచి భారీగా క్రూడ్ ఆయిల్‌ను దిగుమతి చేసుకుంటోందన్న కారణంతో అమెరికా భారత్‌పై అదనపు సుంకాలు విధించిన నేపథ్యంలో పుతిన్ పర్యటన వ్యూహాత్మకంగా ముఖ్యమైందిగా భావిస్తున్నారు. ఇంధన భద్రత, గ్లోబల్ జీయోపాలిటిక్స్‌పై ఇరు దేశాలు స్పష్టమైన చర్చలు జరపనున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. భారత్–రష్యా సంబంధాలు గత కొన్ని దశాబ్దాలుగా బలంగా కొనసాగుతున్నాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: