అఫ్ఘనిస్థాన్‌లోని తాలిబన్(Taliban) ప్రభుత్వానికి మద్దతుగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఉగ్రవాదాన్ని అరికట్టడంలోను, ఓపియం (నల్లమందు) ఉత్పత్తిని నియంత్రించడంలోను తాలిబన్లు గణనీయమైన పురోగతి సాధించారని ఆయన ప్రశంసించారు. తాలిబన్లు ఉగ్రవాద సంస్థలకు మద్దతిస్తున్నారన్న పాకిస్థాన్ వాదనకు పుతిన్ వ్యాఖ్యలు పూర్తి విరుద్ధంగా ఉండటం గమనార్హం.
Read Also: Russia: మా స్నేహ బంధం గొప్పది..అది కొనసాగుతుంది ..పుతిన్
పరిస్థితి పూర్తిగా తాలిబన్ల నియంత్రణలో ఉంది
ఇండియా టుడేకు ఇచ్చిన ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో పుతిన్ మాట్లాడుతూ.. “దశాబ్దాల అంతర్యుద్ధం తర్వాత అఫ్ఘనిస్థాన్ అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది. అయితే, ప్రస్తుతం అక్కడ పరిస్థితి పూర్తిగా తాలిబన్ల నియంత్రణలో ఉంది. ఇది కాదనలేని వాస్తవం” అని స్పష్టం చేశారు. ఐసిస్-ఖొరాసన్ వంటి ఉగ్రవాద గ్రూపులపై తాలిబన్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల గురించి తమకు పూర్తి అవగాహన ఉందని ఆయన తెలిపారు. పుతిన్ వ్యాఖ్యలు.. తెహ్రీక్-ఏ-తాలిబన్ పాకిస్థాన్ (టీటీపీ)కి తాలిబన్లు ఆశ్రయం కల్పిస్తున్నారనే పాకిస్థాన్ ఆరోపణలను పరోక్షంగా తోసిపుచ్చినట్లయింది. పాక్‌లో ఇటీవలి కాలంలో పెరిగిన దాడులకు టీటీపీనే కారణమని ఇస్లామాబాద్ ఆరోపిస్తోంది.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: