Latest Telugu News: India: పుతిన్ పర్యటనతో భారత్ ప్రయోజనం ఎంత?

Read Time:  1 min
పుతిన్ పర్యటనతో భారత్ ప్రయోజనం ఎంత?
పుతిన్ పర్యటనతో భారత్ ప్రయోజనం ఎంత?
FONT SIZE
GET APP

రష్యా అధ్యక్షుడు పుతిన్ (Putin) నేటి నుంచి రెండు రోజులపాటు భారత్‌లో పర్యటిస్తున్నారు.
రెండు దేశాల మధ్య జరిగే వార్షిక సమావేశంలో ఆయన భారత ప్రధాని నరేంద్ర మోదీతో పలు అంశాలపై చర్చిస్తారు. రష్యా నుంచి చమురు కొనుగోళ్లు చేయవద్దంటూ భారత్‌పై గత కొన్ని నెలలుగా అమెరికా ఒత్తిళ్లు పెంచుతున్న తరుణంలోనే, భారత్-రష్యాలు పలు ఒప్పందాలపై సంతకాలు చేసుకునే అవకాశం ఉంది. అయితే, పుతిన్ భారత పర్యటనకు ముందు రష్యా ఒక కీలకమైన వ్యాఖ్య చేసింది. తమకు చైనా ఎంత ముఖ్యమో భారత్ కూడా అంతే ముఖ్యమని స్పష్టం చేసింది. ఈ ప్రకటనకు కారణమేంటి? భారత్‌తో సంబంధాలు రష్యాకు ఎందుకంత ముఖ్యం?

Read Also: MH-370: అదృశ్య విమానం సెర్చ్ తిరిగి మొదలు

Modi and Putin
Modi and Putin

రష్యాతో సంబంధాల విషయంలో భారత్ కు ఇబ్బందులు?

పుతిన్ ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ ఓ మీడియా సమావేశంలో మాట్లాడారు. రష్యా-చైనాల మధ్య సంబంధాలను బలంగా ఉన్నాయనీ, భారత్ విషయంలో రష్యా అదే వైఖరితో ఉందని పెస్కోవ్ స్పష్టం చేశారు. ఇప్పుడు తమతో ముందుకు సాగడానికి భారత్ ఎంత వరకు సిద్ధంగా ఉందనే దానిపైనే ఈ సంబంధాల కొనసాగింపు ఆధారాపడి ఉంటుందని ఆయన అన్నారు. ”చైనా మా ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామి. చైనాతో సరిహద్దులుదాటే స్నేహాన్ని కొనసాగించడానికి మేం సిద్ధంగా ఉన్నాం. భారతదేశంతో కూడా మాకు అదే రకమైన విధానం ఉంది.

భారతదేశం ఏం కోరుకుంటోంది?

స్నేహ సంబంధాల విషయంలో బంతిని భారతదేశం కోర్టులోకి నెట్టినప్పటికీ రష్యా కల నెరవేరదని జిందాల్ స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ అఫైర్స్ డీన్, ‘ఫ్రెండ్స్: ఇండియాస్ క్లోజెస్ట్ స్ట్రాటజిక్ పార్టనర్స్’ రచయిత శ్రీరామ్ చౌలియా అన్నారు. ‘‘రష్యా, చైనాల మధ్య ఉన్న పొత్తు అమెరికాకు ఇష్టంలేని వ్యవహారం. ఈ కూటమిలో భాగం కావాలని భారతదేశం కోరుకోవడం లేదు. చైనా, రష్యా రెండూ అమెరికాను ప్రత్యర్థిగా భావిస్తాయి. కానీ భారతదేశం అందుకు సుముఖంగా లేదు. భారత్ తన అభివృద్ధి ప్రయాణంలో రష్యా కోసం అమెరికానుగానీ, అమెరికా కోసం రష్యానుగానీ వదులుకునే స్థితిలో లేదు’’ అని చౌలియా అన్నారు.

Read hindi news: https://hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

Vanipushpa

రచయిత గురించి

Vanipushpa

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.