📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Trump: ఆ రెండు దేశాలే గ్రీన్‌లాండ్ సమస్యను పరిష్కరించుకుంటాయి: పుతిన్

Author Icon By Vanipushpa
Updated: January 22, 2026 • 11:45 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గ్రీన్‌లాండ్‌ ద్వీపాన్ని ఎలాగైనా కొనుగోలు చేయాలని పట్టుబట్టడంతో.. ప్రస్తుతం అంతర్జాతీయ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేగుతోంది. ఈ వ్యవహారం ఇప్పటికే డెన్మార్క్‌ను ఉక్కిరిబిక్కిరి చేయడమే కాకుండా నాటో కూటమిలో కూడా చిచ్చు పెడుతోంది. అయితే ఈ మొత్తం గందరగోళంపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్(Putin) తొలిసారిగా స్పందించారు. బుధవారం రాత్రి జరిగిన జాతీయ భద్రతా మండలి సమావేశంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. గ్రీన్‌లాండ్‌ కొనుగోలుపై మీ వైఖరి ఏంటని అడిగిన ప్రశ్నకు పుతిన్ చాలా వ్యంగ్యంగా సమాధానం ఇచ్చారు. “గ్రీన్‌లాండ్‌కు ఏం జరుగుతుందనేది మాకు అనవసరమైన విషయం. అది మా వ్యాపారం కాదు” అని ఆయన స్పష్టం చేశారు.

Read Also: WEF: తెలంగాణకు భారీ పెట్టుబడులు: టాటా గ్రూప్‌తో కీలక ఒప్పందాలు

Trump: ఆ రెండు దేశాలే గ్రీన్‌లాండ్ సమస్యను పరిష్కరించుకుంటాయి: పుతిన్

అమెరికా, డెన్మార్క్ మధ్య జరుగుతున్న ఈ వివాదం తమకు ఏమాత్రం ఆందోళన కలిగించడం లేదని, ఆ రెండు దేశాలే ఈ సమస్యను పరిష్కరించుకుంటాయని ఆయన అభిప్రాయపడ్డారు.

డెన్మార్క్ అనుసరిస్తున్న తీరుపై విమర్శలు

ఈ సందర్భంగా పుతిన్ గ్రీన్‌లాండ్‌పై డెన్మార్క్ అనుసరిస్తున్న తీరును తప్పుబట్టారు. చరిత్రను ప్రస్తావిస్తూ.. “నిజానికి డెన్మార్క్ ఎప్పుడూ గ్రీన్‌లాండ్‌ను వలస ప్రాంతంగానే చూసింది. ఆ ద్వీపం పట్ల డెన్మార్క్ చాలా కఠినంగా, కొన్నిసార్లు క్రూరంగా కూడా వ్యవహరించింది. అయితే అది పాత విషయం. ఇప్పుడు దాని గురించి ఎవరూ ఆసక్తి చూపడం లేదనుకోండి” అని చమత్కరించారు. అమెరికా భూభాగాలను కొనుగోలు చేయడం ఇదేం మొదటిసారి కాదని పుతిన్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. 1917లో డెన్మార్క్ తన ఆధీనంలో ఉన్న వర్జిన్ ఐలాండ్స్‌ను అమెరికాకు విక్రయించిన విషయాన్ని తెలిపారు. రష్యా కూడా గతంలో ఇదే పని చేసిందని ఆయన ఒప్పుకున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Arctic Politics global geopolitics Greenland issue International Relations Latest News in Telugu Russia on Greenland Telugu News online Telugu News Today Vladimir Putin statement

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.