Latest Telugu News: India Visit: 25 సంవత్సరాలుగా రారాజుగా పాలిస్తున్న పుతిన్

Read Time:  1 min
25 సంవత్సరాలుగా రారాజుగా పాలిస్తున్న పుతిన్
25 సంవత్సరాలుగా రారాజుగా పాలిస్తున్న పుతిన్
FONT SIZE
GET APP

రష్యా అధ్యక్షుడిగా పుతిన్‌(Putin) పాలనా పగ్గాలు చేపట్టినప్పటి నుంచి పలు దేశాల్లో అనేకమంది పాలకులు మారారు. దాదాపు పాతికేళ్లుగా పుతిన్‌ అధికారంలో కొనసాగుతున్నారు. ఈ కాలంలో అమెరికాలో ఐదుగురు అధ్యక్షులు మారారు. భారత్‌ ముగ్గురు ప్రధానులను చూసింది. పుతిన్ తప్ప మరో అధ్యక్షుడి పేరు తెలియని యువ ఓటర్లు రష్యాలో చాలా మందే ఉన్నారంటే అతిశయోక్తి కాదు. 1952 అక్టోబర్‌ 7న లెనిన్‌గ్రాడ్‌లో పుతిన్‌ జన్మించారు. ఆయన బాల్యం సాధారణంగా గడిచింది. న్యాయ శాస్త్రం పూర్తిచేసిన పుతిన్‌, 1975లో రష్యా గూఢచార సంస్థ KGBలో చేరారు. 1985లో తూర్పు జర్మనీలో స్పైగా పనిచేశారు. స్వదేశానికి తిరిగి వచ్చిన తర్వాత రాజకీయాల వైపు అడుగులు వేశారు. 1991లో రాజకీయ ప్రవేశం చేసిన ఆయన, సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌ డిప్యూటీ మేయర్‌గా బాధ్యతలు చేపట్టారు.

 

Read also: Israel: అరెస్టుకు భయపడను.. న్యూయార్క్ పర్యటనపై నెతన్యాహు

India Visit
India Visit

తొలిసారి రష్యా అధ్యక్ష పీఠాన్నిచేజిక్కించుకున్న పుతిన్‌

1998లో రష్యా సెక్యూరిటీ సర్వీస్‌కు అధిపతిగా పుతిన్‌ను అప్పటి అధ్యక్షుడు బోరిస్‌ యెల్సిన్‌ నియమించారు. ఆ మరుసటి ఏడాదిలో అప్పటి ప్రధాన మంత్రిని తొలగించిన బోరిస్‌ 46 ఏళ్ల పుతిన్‌ను ఆ స్థానంలో భర్తీ చేశారు. ఆ తర్వాత కొన్ని నెలలకే బోరిస్‌ రాజీనామా చేయడంతో తాత్కాలికంగా అధ్యక్ష బాధ్యతలను పుతిన్‌ చేపట్టారు. అలా తొలిసారి రష్యా అధ్యక్ష పీఠాన్ని పుతిన్‌ చేజిక్కించుకున్నారు. 2000లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో గెలవడంతో పాటు 2004లో రెండోసారి ఆ బాధ్యతల్లో పుతిన్‌ కొనసాగారు.

అధ్యక్ష పదవీకాలాన్ని ఆరేళ్లకు పెంచుతూ రాజ్యాంగ సవరణ

రష్యా రాజ్యాంగం ప్రకారం వరుసగా మూడోసారి అధ్యక్షుడిగా కొనసాగే అవకాశం లేకపోవడంతో 2008లో పుతిన్‌ ప్రధాని పదవి చేపట్టారు. ఈ సమయంలోనే అధ్యక్ష పదవీకాలాన్ని ఆరేళ్లకు పెంచుతూ రాజ్యాంగ సవరణ చేశారు. మళ్లీ 2012లో మరోసారి అధ్యక్ష పగ్గాలు చేపట్టిన పుతిన్‌ 2018లో నాలుగోసారి ఎన్నికయ్యారు. 2024 ఎన్నికల్లో ఐదోసారి గెలిచిన పుతిన్‌, 2030 వరకు అధ్యక్ష పదవిలో కొనసాగనున్నారు. 1999లో తొలిసారి రష్యా పాలనా పగ్గాలు చేపట్టిన పుతిన్‌ గత 25 ఏళ్లుగా ఆ దేశ ప్రధానిగా, అధ్యక్షుడిగా కొనసాగుతూనే ఉన్నారు.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

Vanipushpa

రచయిత గురించి

Vanipushpa

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.