భారతీయ బ్యాంకింగ్ రంగం అంతర్జాతీయ ప్రమాణాలకు చేరుకునే దిశగా మరో కీలక అడుగు పడబోతోంది. ప్రభుత్వ రంగ బ్యాంకులను శక్తివంతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం మరోసారి పెద్ద స్థాయి విలీనాన్ని చేపట్టేందుకు సిద్ధమవుతోంది. ప్రపంచ టాప్ 100 బ్యాంకుల్లో స్థానం దక్కించుకోవాలంటే చిన్న PSU బ్యాంకుల(PSU Banks)ను ఒకటి కింద ఒకటిగా కలిపి పెద్ద సంస్థలుగా మార్పు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ విలీనం పూర్తయితే ఆదాయం, మార్కెట్ విలువ, కార్యకలాపాల సామర్థ్యం గణనీయంగా పెరుగుతాయని భావిస్తున్నారు.
Read also : Banks: బ్యాంకులకు ట్రాయ్ కీలక అప్‌డేట్.. జనవరి 1 నుంచి అమల్లోకి..
ప్రభుత్వ రంగ బ్యాంకులతో విలీనం
దేశంలో అతిపెద్ద రుణదాత అయిన ఎస్బీఐ (SBI) కూడా ఈ చర్యకు మద్దతు ఇస్తోంది. తాజాగా, మొత్తం ఆరు చిన్న బ్యాంకులను ఇతర పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకులతో విలీనం చేసే అవకాశాలు బలంగా వినిపిస్తున్నాయి.
విలీనానికి పరిశీలనలో ఉన్న బ్యాంకులు:
- బ్యాంక్ ఆఫ్ ఇండియా(Bank of India)
- ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్(Indian Overseas Bank)
- సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(Central Bank of India)
- బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర(Bank of Maharashtra)
- యూకో బ్యాంక్(UCO Bank)
- పంజాబ్ & సింధ్ బ్యాంక్(Punjab & Sind Bank)
వీటిని 2026 ఏప్రిల్ నాటికి ఎస్బీఐ, పీఎన్‌బీ, బ్యాంక్ ఆఫ్ బరోడా, యూనియన్ బ్యాంక్ వంటి పెద్ద PSU బ్యాంకుల్లో కలపాలనే ప్రతిపాదనలపై చర్చ జరుగుతోంది. ఈ విలీనం అమలైతే భవిష్యత్తులో భారత్‌లో కొద్దికే ప్రభుత్వ రంగ బ్యాంకులు మిగిలే అవకాశం ఉన్నప్పటికీ, ఇవి ప్రపంచ స్థాయిలో పోటీ చేసే సామర్థ్యాన్ని పెంచుకుంటాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.
Read hindi news: https://hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read also :