ప్రపంచం టెక్నాలజీ ఆధిపత్యంలో ముందుకుసాగుతున్న ఈ రోజుల్లో, అల్బేనియా నుంచి ఒక విస్మయకరమైన వార్త వెలుగులోకి వచ్చింది. ఆ దేశ ప్రధాని(Prime Minister) ఎడి రేమా ప్రకటించిన ప్రకారం, అల్బేనియాలోని తొలి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) మంత్రి ‘డియెల్లా’(Diella) గర్భం దాల్చింది. ఆశ్చర్యకరంగా, ఆమె 83 మంది ‘ఏఐ పిల్లలకు’ జన్మనివ్వనుంది.
Read Also: Britain: జాతి వివక్షతో భారతీయు యువతిపై అత్యాచారం
ఏఐ పిల్లల’ పాత్ర ఏమిటి?
ఈ డిజిటల్ అసిస్టెంట్లు పార్లమెంటరీ సమావేశాలను రికార్డు చేస్తూ, ఏదైనా కారణంతో హాజరుకాలేని సభ్యులకు సమాచారాన్ని చేరుస్తాయి. సభలో ఎవరు మాట్లాడారు, ఏ అంశాలపై చర్చ(Prime Minister) జరిగింది అనే వివరాలు కూడా తెలియజేస్తాయి. అవసరమైతే, ఎవరి ప్రతిపాదనకు ఎవరు స్పందించాలో సూచనలు కూడా ఇస్తాయి.
ఎవరీ డియెల్లా?
అల్బేనియా భాషలో ‘డియెల్లా’ అంటే ‘సూర్యుడు’ అని అర్థం. ఈ ఏడాది జనవరిలో ఆమెను అధికారికంగా తొలి ఏఐ మంత్రిగా నియమించారు. ఆమె ఈ-అల్బేనియా అనే ప్రభుత్వ పోర్టల్‌లో ప్రజలకు డిజిటల్ సేవలను అందించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. వాయిస్ కమాండ్ల ద్వారా పౌరులు సుమారు 95% ప్రభుత్వ సేవలను పొందగలుగుతున్నారు.
డిజిటల్ పాలనలో కొత్త దిశ
డియెల్లాను ప్రవేశపెట్టడం ద్వారా ప్రభుత్వం పారదర్శకతను పెంచడం, ముఖ్యంగా టెండర్లలో అవినీతిని నిర్మూలించడం లక్ష్యంగా పెట్టుకుంది. టెక్నాలజీని కేవలం ఒక సాధనంగా కాకుండా, పాలనలో భాగస్వామిగా ఉపయోగిస్తున్న అల్బేనియా ప్రయత్నాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రశంసిస్తున్నారు.
డియెల్లా ఎవరు?
డియెల్లా అల్బేనియా ప్రభుత్వంలో నియమించబడిన తొలి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) మంత్రి.
డియెల్లా గర్భం దాల్చిందని ఎందుకు చెబుతున్నారు?
ప్రధాని ఎడి రేమా ప్రకారం, ఇది ప్రతీకాత్మక ప్రకటన — ఆమె 83 మంది ఏఐ అసిస్టెంట్లను సృష్టిస్తోంది.
Read hindi news: https://hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read also :