📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Prime Minister of Britain: ఇజ్రాయెల్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన బ్రిటన్ ప్రధాని

Author Icon By Anusha
Updated: July 30, 2025 • 11:41 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

గతకొన్ని మాసాలుగా గాజాపై ఇజ్రాయెల్ ఎడతెరపిలేకుండా దాడులకు పాల్పడుతున్నది. దీంతో గాజా ప్రాంతమంతా చిన్నాభిన్నమైపోయింది. ఎక్కడ చూసినా శిథిలమైపోయిన భవనాలు, ఆకలు కేకలు వినిపిస్తున్నాయి. ప్రపంచదేశాలు గగ్గోలు పెడుతున్నా ఇజ్రాయెల్ఏమాత్రం చలించడం లేదు. ఇప్పటికే గాజా (Gaza) లో వేలాదిమంది ప్రజలు మరణించారు.రోజురోజుకు ఈ సంఖ్య పెరుగుతున్నది. చాలామంది,పక్కదేశాలకు వలసలుగా వెళ్లిపోయారు. ఎక్కడికీ వెళ్లలేనివారి జీవనవిధానం కడుదయనీయంగా మారింది. తినేందుకు తిండిలేదు.మంచినీరు లేదు. ఇక జబ్బుచేస్తే వైద్యం చేసేందుకు మందులు, వైద్యపరికరాలు లేవు. ఆహారం కోసం వేచిఉంటున్నవారిపై ఇజ్రాయెల్ వైమానిక దాడులకు పాల్పడుతూ, కడు అమానవీయంగా ప్రవర్తిస్తున్నది. దీంతో ఇజ్రాయెల్ దేశాన్ని బ్రిటన్ ప్రధాని తీవ్రంగా హెచ్చరించారు.

పాలస్తీనాను ప్రత్యేకదేశంగా భావిస్తాం

ఇజ్రాయెల్ గాజాపై దాడులు ఆపాలని, లేకపోతే సెప్టెంబర్లో జరిగే ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో పాలస్తీనాను ప్రత్యేక దేశంగా,యూకే గుర్తిస్తుందని ప్రధాని కైర్ స్టార్మర్ (Keir Starmer) స్పష్టం చేశారు. మంగళవారం 10 డైనింగ్ స్ట్రీంట్ నుంచి ప్రసంగించిన స్టార్మర్, అక్టోబర్ 7నబందీలుగా తీసుకువెళ్లిన ఇజ్రాయెల్ పౌరులను వెంటనే విడుదల చేయాలని హమాస్ను కోరారు. అంతేకాదు తక్షణమే కాల్పుల విరమణఒప్పందంపై సంతకం చేయాలని, నిరాయుధీకరణకు కట్టుబడి ఉండాలని హమాస్కు సూచించారు. గాజా ప్రభుత్వంలో తాము ఎటువంటిపాత్ర పోషించమని హమాస్ అంగీకరించాలని ఆయన స్పష్టం చేశారు.

Prime Minister of Britain: ఇజ్రాయెల్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన బ్రిటన్ ప్రధాని

గాజాలోకి మళ్లీ మానవతాసాయం

స్కాట్లాండ్లో జరిగిన చర్చల సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తో తాను ఈ అంశంపై చర్చించానని స్టార్మర్ పేర్కొన్నారు.గాజాలోకి మళ్లీ మానవతాసాయం, సామగ్రి తీసుకురావడానికి తాను మార్గం సుగమం చేశానని అన్నారు.ఆచరణీయమైన, సార్వభౌమ పాలస్తీనా దేశం. కానీ ప్రస్తుతం ఆ లక్ష్యం ముందు ఎన్నడూ లేనంత ఒత్తిడిలో ఉంది అని కీర్ స్టార్మర్ అన్నారు.

బ్రిటన్ ప్రధాన మంత్రి కీర్ స్టార్మర్ జీవిత విశేషాలు ఏమిటి?

కీర్ స్టార్మర్ యునైటెడ్ కింగ్‌డమ్ ప్రస్తుత ప్రధాన మంత్రి మరియు లేబర్ పార్టీ నాయకుడు. ఆయన 2 సెప్టెంబర్ 1962న లండన్‌లో జన్మించారు.

కీర్ స్టార్మర్ రాజకీయ ప్రవేశం?

న్యాయవాదిగా తన వృత్తిని ప్రారంభించిన స్టార్మర్ మానవ హక్కుల చట్ట నిపుణుడిగా ప్రసిద్ధి చెందారు. తరువాత బ్రిటన్ అటార్నీ జనరల్‌గా పనిచేశారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also: IND vs ENG: టీమిండియా సెలెక్షన్ కమిటీపై సుందర్ తండ్రి అసహనం

Breaking News Gaza Food and Water Shortage Gaza Medical Crisis Israel Palestine Conflict Update latest news Telugu News UK PM Warning to Israel

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.