📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Latest News: PM Modi: జీ20 సమ్మిట్‌లో ప్రధాని మోదీ కీలక ప్రతిపాదనలు..

Author Icon By Aanusha
Updated: November 22, 2025 • 9:28 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

దక్షిణాఫ్రికా రాజధాని జోహనెస్‌బర్గ్ వేదికగా జరిగిన జీ20 శిఖరాగ్ర సదస్సు (G20 Summit) లో ప్రపంచం అభివృద్ధే లక్ష్యంగా ప్రధాన మంత్రి నరేంద్ర (PM Modi) మోదీఅన్నారు. అలాగే,ప్రధాని మోదీ కీలక ప్రతిపాదనలు చేసారు..గ్లోబల్ ట్రెడిషనల్ నాలెడ్జ్ రిపాజిటరీ, ఆఫ్రికా స్కిల్స్ మల్టిప్లియర్ ఇనిషియేటివ్, గ్లోబల్ హెల్త్‌కేర్ రెస్పాన్స్ టీమ్, డ్రగ్స్-ఉగ్రవాదం ఎదుర్కొడానికి ప్రత్యేక కార్యక్రమంలో ఇందులో ఉన్నాయి.

Read Also: South Africa: జి-20 వేదికకు ముగ్గురు అగ్రనేతలు దూరం.. కారణం?

గ్లోబల్ ట్రెడిషనల్ నాలెడ్జ్ రిపాజిటరీ

జీ 20 శిఖరాగ్ర సదస్సులో సమగ్ర, సుస్థిరాభివృద్ధి అంశంపై ప్రధాని ప్రసంగిస్తూ.. ఈ సరికొత్త కార్యక్రమాలు ప్రపంచ సుస్థిర అభివృద్దికి సహకరిస్తాయని, ఇందుకు భారతీయ విలువలు, నాగరికత దిశనిర్దేశనం చేస్తాయని మోదీ ఉద్ఘాటించారు. జీ20 గ్లోబల్ ట్రెడిషనల్ నాలెడ్జ్ రిపాజిటరీ గురించి మోదీ ప్రసంగిస్తూ.. సుస్థిర జీవనానికి కాలం పరీక్షించిన నమూనాలను సాంప్రదాయ జ్ఞానాన్ని పూర్వాపరాలతో నమోదు చేసి, దానిని భవిష్యత్తు తరాలకు అందజేస్తుందని అన్నారు.

‘ఈ విషయంలో భారత్‌కు ఎంతో ఘనమైన చరిత్ర ఉంది.. ఇది మంచి ఆరోగ్యం, శ్రేయస్సు కోసం మన సమిష్టి జ్ఞానాన్ని భవిష్యత్తు తరాలకు చేరవేయడంలో సహాయపడుతుంది’ అని ప్రధాని పేర్కొన్నారు. ప్రపంచ ప్రగతికి ఆఫ్రికా అభివృద్ధి అత్యంత కీలకమని, ఈ ఖండానికి భారత్ ఎప్పుడూ మద్దతుగా నిలుస్తుందని మోదీ అన్నారు.

ఆఫ్రికా యువతకు నైపుణ్య శిక్షణ

అలాగే, ఆఫ్రికా స్కిల్స్ మల్టిప్లియర్ ఇనిషియేటివ్ ట్రైన్-ది-ట్రైనర్స్ మోడల్‌ను అనుసరిస్తుందని, వచ్చే పదేళ్ల కాలంలో ఆఫ్రికాలోని పది లక్షల మంది సర్టిఫైడ్ ట్రైనర్లను తయారు చేయడమే లక్ష్యమని ఆయన చెప్పారు. ‘‘మన సమిష్టి లక్ష్యం వచ్చే పదేళ్లలో ఆఫ్రికాలోని మిలియన్ మంది సర్టిఫైడ్ ట్రైనర్లను తీర్చిదిద్దడం.

ఈ ట్రైనర్లు తిరిగి లక్షలాది మంది యువతకు నైపుణ్యాలను బోధిస్తారు. ఈ కార్యక్రమం బహు విధాలుగా ప్రభావం చూపుతుంది.. ఇది స్థానిక సామర్థ్యాన్ని పెంచి, ఆఫ్రికా దీర్ఘకాలిక అభివృద్ధిని బలపరుస్తుంది’’ అని ప్రధాని పేర్కొన్నారు. ఆరోగ్య అత్యవసర పరిస్థితుల్లో బలమైన ప్రతిస్పందన అందజేయడానికి జీ20 గ్లోబల్ హెల్త్‌కేర్ రెస్పాన్స్ టీమ్ సైతం ఏర్పాటుచేయాలని ఆయన ప్రతిపాదించారు(PM Modi).

ప్రకృతి విపత్తు సంభవించినప్పుడు సేవలు అందించేందుకు సిద్ధంగా ఉండాలి

‘‘హెల్త్ ఎమర్జెన్సీ, ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు కలిసి పనిచేస్తేనే మన బలం పెరుగుతుంది.. ఏదైనా మహమ్మారి లేదా ప్రకృతి విపత్తు సంభవించినప్పుడు త్వరగా సేవలు అందించేందుకు సిద్ధంగా ఉండేలా G20 దేశాలకు చెందిన శిక్షణ పొందిన వైద్య నిపుణుల బృందాలను తయారుచేయాలి’’ అని ఆయన అన్నారు.

అలాగే, డ్రగ్స్–ఉగ్రవాదం అనుబంధాన్ని ఎదుర్కోవడానికి ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేయాలని కూడా మోదీ సూచించారు. దీని వల్ల డ్రగ్ స్మగ్లింగ్ అరికట్టి, ఫెంటనిల్ వంటి ప్రమాదకర మత్తు పదార్థాలను అడ్డుకోగలమని చెప్పారు.

మోదీకి స్వాగతం

సదస్సుకు ముందు దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్‌ రమఫోసా చేతులు జోడించి మోదీకి నమస్కరిస్తూ, స్వాగతం పలికారు. జీ7 సదస్సులో భాగంగా ప్రధాని మోదీ వరుస ద్వైపాక్షిక భేటీలతో బిజీబిజీగా గడిపారు.

చైనా, ఇటలీ, బ్రిటన్, ఫ్రాన్స్, కెనడా, జర్మనీ, జపాన్‌, ఆస్ట్రేలియా సహా పలు దేశాల అధినేతలతో విడివిడిగా సమావేశమయ్యారు. మోదీ ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్‌తో రక్షణ, అణు ఇంధనం సహా పలు రంగాల్లో పరస్పర సహకారం పెంపుపై చర్చించినట్లు విదేశాంగ శాఖ వెల్లడించింది.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

G20 Summit global development programs latest news Modi initiatives Telugu News traditional knowledge repository

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.