📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Latest News: PM Modi: భూటాన్ నాలుగో రాజుతో ప్రధాని మోదీ భేటీ

Author Icon By Anusha
Updated: November 12, 2025 • 11:25 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) తన రెండ్రోజుల భూటాన్ పర్యటన (Bhutan Visit) ను విజయవంతంగా ముగించారు. ఈ పర్యటన భారత్‌ యొక్క ‘నైబర్‌హుడ్ ఫస్ట్ (Neighbourhood First)’ విధానానికి మరో నిదర్శనంగా నిలిచింది. భూటాన్‌తో ఉన్న స్నేహపూర్వక, వ్యూహాత్మక సంబంధాలను మరింత బలపర్చడమే ఈ పర్యటన ప్రధాన లక్ష్యమని విదేశాంగ వర్గాలు వెల్లడించాయి.

Read Also: CRI Report: భారత్‌లో ప్రకృతి విపత్తుల ప్రభావం తీవ్రం – 30 ఏళ్లలో 80 వేల మంది మృతి

అంతకుముందు మంగళవారం ప్రధాని మోదీ (PM Modi) , భూటాన్ ప్రస్తుత రాజు జిగ్మే ఖేసర్ నామ్‌గ్యేల్ వాంగ్‌చుక్‌తో విస్తృత స్థాయి చర్చలు జరిపారు. ఇంధనం, కనెక్టివిటీ, సాంకేతికత, రక్షణ, భద్రత వంటి పలు కీలక రంగాల్లో ద్వైపాక్షిక సహకారంపై ఇరువురు నేతలు సమీక్షించారు. చర్చల అనంతరం భారత్-భూటాన్ భాగస్వామ్యంతో నిర్మించిన 1020 మెగావాట్ల పునత్‌సాంగ్‌ఛు-II జల విద్యుత్ ప్రాజెక్టును ఇద్దరు నేతలు కలిసి ప్రారంభించారు.

ఇది ఇరు దేశాల మధ్య ఇంధన రంగంలో బలపడుతున్న బంధానికి నిదర్శనంగా నిలిచింది.ఈ సమావేశంపై ప్రధాని మోదీ సోషల్ మీడియా ద్వారా స్పందించారు. “భూటాన్ (Bhutan) రాజుతో సమావేశం చాలా ఫలప్రదంగా జరిగింది. ఇరు దేశాల మధ్య ఉన్న అన్ని అంశాలపై చర్చించాం. భూటాన్ అభివృద్ధి ప్రయాణంలో భారత్ ఒక కీలక భాగస్వామి కావడం మాకు గర్వకారణం” అని ఆయన పేర్కొన్నారు.ఈ పర్యటనలో సాంస్కృతిక, ఆధ్యాత్మిక బంధాలకు కూడా పెద్దపీట వేశారు.

PM Modi

భూటాన్ రాజుతో కలిసి దర్శించుకున్నారు

భూటాన్ నాలుగో రాజు జిగ్మే సింగ్యే వాంగ్‌చుక్ 70వ జన్మదిన వేడుకల్లో ప్రధాని మోదీ పాల్గొన్నారు. అలాగే థింఫులోని తాషిచోడ్‌జాంగ్‌లో గౌతమ బుద్ధుడి పవిత్ర అవశేషాలను భూటాన్ రాజుతో కలిసి దర్శించుకున్నారు.

ఈ ప్రత్యేక కార్యక్రమం కోసం ఈ అవశేషాలను భారత్ నుంచి పంపడం విశేషం. 1972 నుంచి 2006 వరకు భూటాన్‌ను పాలించిన జిగ్మే సింగ్యే వాంగ్‌చుక్, దేశ ఆధునికీకరణలో కీలక పాత్ర పోషించడంతో పాటు ‘స్థూల జాతీయ సంతోషం’ అనే సిద్ధాంతంతో ప్రపంచ గుర్తింపు పొందారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

Bhutan Visit Druk Gyalpo Jigme Khesar Namgyel Wangchuck latest news Narendra Modi Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.