📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

కేజ్రీవాల్ ఓటమిపై ప్రశాంత్ కిషోర్ స్పందన

Author Icon By Sharanya
Updated: February 10, 2025 • 11:06 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఢిల్లీ ఎన్నికల్లో హ్యాట్రిక్ ఆశించిన అధికార ఆమ్ ఆద్మీ పార్టీకి ఘోర పరాజయం ఎదురైంది. ఆప్ తో పాటు ఎవరూ ఊహించని విధంగా ఎన్నికల ఫలితాలు వచ్చాయి.ఆప్ కేవలం 22 స్థానాలకే పరిమితమైంది. బీజేపీ కూడా ఆశించిన దాని కంటే ఎక్కువగానే సీట్లు సంపాదించుకుంది. అలాగే న్యూఢిల్లీలో సీటులో కేజ్రివాల్ స్వయంగా ఓటమిపాలయ్యారు. దీనిపై రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ స్పందించారు. ఆయన మాట్లాడుతూ ఈ ఓటమి వెనుక కేజ్రివాల్ చేసిన రాజకీయ తప్పిదం బయటపెట్టారు.ఇటీవల కాలంలో కేజ్రీవాల్ రాజకీయ వైఖరి మారింది.ఇండియా కూటమిపై అయన నిర్ణయాలు కొంత దెబ్బ తీశాయి.

ఇదే సమయంలో ఢిల్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేశారు. ఇది పనితీరుపై ప్రభావం చూపింది. ఢిల్లీ మద్యం స్కాంలో పలువురు ఆప్ కీలక నేతల అరెస్టు తర్వాత చివరిగా సీఎంగా ఉన్న అరవింద్ కేజ్రివాల్ అరెస్టు అయ్యారు. అయితే ఆ అరెస్టు తర్వాత కేజ్రివాల్ తన సీఎం పదవికి రాజీనామా చేయలేదు. అలా చేయకుండా బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించారు. కోర్టుల్లోనూ సుదీర్ఘ పోరాటం చేసి చివరికి బెయిల్ తెచ్చుకుని అనంతరం తన సీఎం పదవిని వదులుకున్నారు. బెయిల్ పొందిన తర్వాత ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలనే అరవింద్ కేజ్రీవాల్ నిర్ణయాన్ని ఒక పెద్ద వ్యూహాత్మక తప్పిదంగా అభివర్ణించారు, ఇది ఢిల్లీలో ఆప్ స్థానాన్ని బలహీనపరిచిందని వాదించారు. ఆ సీట్లో పార్టీలో సీనియర్ నేత అయిన అతిషిని కూర్చోబెట్టారు. ఇదే అతిపెద్ద రాజకీయ తప్పిదమని ప్రశాంత్ కిషోర్ తెలిపారు.

మద్యం పాలసీ కేసులో అరెస్టు తర్వాత కేజ్రివాల్ తన పదవికి రాజీనామా చేసేసి ఉంటే పరిస్ధితి మరోలా ఉండేదని ప్రశాంత్ కిషోర్ విశ్లేషించారు. అలా చేయకుండా బెయిల్ కోరడంతో ఢిల్లీలో ఆప్ కోటకు బీటలు వారడం మొదలైందని పీకే తేల్చేశారు. అలాగే కేజ్రివాల్ ఈ మధ్య కాలంలో తరచుగా తన రాజకీయ అభిప్రాయాల్ని మార్చుకోవడం కూడా ఢిల్లీలో ఆప్ చిత్తుగా ఓడేందుకు కారణమైందని ప్రశాంత్ తెలిపారు. ముఖ్యంగా ముందు ఇండియా కూటమిలో చేరడం, ఆ తర్వాత ఢిల్లీ ఎన్నికల్లో కూటమిలో భాగస్వామి అయిన కాంగ్రెస్ ను కలుపుకోకుండా ఒంటరిగా పోటీ చేయడం వంటి తప్పిదాలు చేశారన్నారు. ఢిల్లీఎన్నికల్లో ఆప్ఓటమికి పదేళ్ల ప్రజా వ్యతిరేకతే ప్రధాన కారణమని ప్రశాంత్ కిషోర్ వెల్లడించారు. ఆ తర్వాత కేజ్రివాల్ రాజీనామా చేయకుండా బెయిల్ కోరడం ఉందన్నారు. ఢిల్లీ వరదలు, కేజ్రివాల్ ఢిల్లీని వదిలి ఇతర రాష్ట్రాలపై ఫోకస్ పెట్టడం వంటి కారణాలు కూడా ఓటర్లలో ఆయనపై అభిప్రాయం మార్చుకునేందుకు కారణమయ్యాయన్నారు.ఢిల్లీ లో ఆప్ రాజకీయా ఆధిపత్యాన్ని తిరిగి పొందడం కష్టమే ఇక ఎంతో కష్టపడితే కానీ,కేజ్రీవాల్ ని ప్రజలు నమ్మే పరిస్థితి లో లేరు అని ఆయన వాఖ్యానించారు.

Breaking News in Telugu delhi Delhi Election Results Google News in Telugu kajriwal Latest News in Telugu Paper Telugu News prashanth kishore Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.