📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Pragnananda: చరిత్ర సృష్టించిన ప్రజ్ఞానంద.. మూడు ఫార్మాట్లలోనూ కార్ల్‌సన్‌ను ఓడించాడు

Author Icon By Anusha
Updated: July 17, 2025 • 5:27 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ప్రపంచ నెంబర్ 1 చెస్ గ్రాండ్‌మాస్టర్, ఐదుసార్లు ప్రపంచ ఛాంపియన్ అయిన మాగ్నస్ కార్ల్‌సన్ వరుస ఓటములతో ఒత్తిడిలో పడిపోయాడు. భారత యువ గ్రాండ్‌మాస్టర్లు అతడి ఆధిపత్యాన్ని సవాలు చేస్తున్నారు. ఇటీవల జరిగిన రెండు ముఖ్యమైన టోర్నీలలో డి. గుకేశ్, ఆర్. ప్రజ్ఞానందా వంటి యువకులు కార్ల్‌సన్‌ (Carlsen) ను చిత్తుచేసి భారత చెస్ ప్రతిభను ప్రపంచానికి చాటించారు. గ్రాండ్ చెస్ టూర్ 2025 జాగ్రెబ్ ఈవెంట్‌లో కార్ల్‌సన్‌ను గుకేశ్ చావు దెబ్బ కొట్టగా, ఇప్పుడు లాస్ వేగాస్‌లో రమేశ్ బాబు ప్రజ్ఞానందా ఓడించాడు. లాస్ వేగాస్ వేదికగా జరిగిన ఫ్రీస్టయిల్ చెస్ గ్రాండ్ స్లామ్ టూర్లో 19 ఏళ్ల ప్రజ్ఞానందా కేవలం 39 ఎత్తుల్లో కార్ల్‌సన్‌ ను ఓడించాడు. నార్వేకు చెందిన గ్రాండ్‌మాస్టర్ కార్ల్‌సన్‌ ఇటీవల భారత ప్రస్తుత ఛాంపియన్ డి.గుకేశ్ (D. Gukesh) చేతుల్లో వరుస పరాభవాలను చవి చూశాడు.ఇది సాంప్రదాయ చెస్‌కి భిన్నంగా, చెస్ 960 (ఫిశర్ ర్యాండమ్ చెస్) ఫార్మాట్‌లో జరిగింది. తెల్ల పావులతో ఆడిన ప్రజ్ఞానందా, 93.9% ఖచ్చితత్వంతో అద్భుతంగా ఆడి, కార్ల్‌సన్ (84.9%)కు ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు. ఈ విజయం ద్వారా ప్రజ్ఞానందా వైట్ గ్రూప్‌లో 4.5 పాయింట్లతో టాప్‌లో నిలిచాడు.

తొలి భారతీయుడిగా

ఈ ఏడాది ఇప్పటికే మూడు టోర్నమెంట్లు గెలుచుకున్న ప్రజ్ఞానంద ఇప్పుడు కార్ల్‌సన్‌ను క్లాసికల్, రాపిడ్, బ్లిట్స్ మూడు ఫార్మాట్లలోనూ ఓడించాడు. కార్ల్‌సన్‌ను ఇలా మూడు ఫార్మాట్లలోనూ ఓడించిన తొలి భారతీయుడిగా ప్రజ్ఞానంద (Pragnananda) నిలవడం విశేషం. ఈ ఓటమితో పాటు మరో మ్యాచ్‌లో వెస్లీ సో చేతితోనూ ఓడిన కార్ల్‌సన్ ఈ ఈవెంట్‌ను బయటకు వెళ్లిపోయాడు.వైట్ గ్రూప్‌లో ఉన్న ప్రజ్ఞానంద మొదటగా అబ్దుసత్తోరోవత్‌తో జరిగిన మ్యాచ్‌‌లో డ్రా, తర్వాత అసౌబాయేవా, కీమర్‌పై వరుస విజయాలు సాధించాడు. చివరగా కార్ల్‌సన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఎత్తుగడలు వేస్తూ విజయం సాధించడమే కాకుండా 4.5 పాయింట్లతో గ్రూప్ టాప్‌లో నిలిచాడు.

టైటిల్ పోరు

ఫ్రీ స్టయిల్ చెస్ గ్రాండ్ స్లామ్ టూర్‌లో ప్రత్యేకత ఏమిటంటే.. ప్రతి ఆటగాడికి పది నిమిషాల టైమ్ కంట్రోల్ ఉంటుంది. ప్రతి మూవ్‌కు పది సెకన్లు. రెండు గ్రూపులుగా విడిపోయి వైట్ అండ్ బ్లాక్‌లో ప్రతి ఒక్కరూ రౌండ్ రాబిన్ ఫార్మాట్‌ (Robin format) లో ఎనిమిది మంది ఆటగాళ్లతో ఆడాల్సి ఉంది. టాప్ 4లో నిలిచిన వారి మధ్య టైటిల్ పోరు సాగుతోంది. గురువారం క్వార్టర్ ఫైనల్స్ జరగనుండగా.. ఈ పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి రెండు లక్షల అమెరికా డాలర్లను బహుమతిగా అందజేయనున్నారు.ఈ విజయాలు భారత చెస్ అభివృద్ధిలో మరిన్ని కొత్త అధ్యాయాలను తెరలేపుతున్నాయి. 10–20 ఏళ్ల వయసున్న యువగ్రాండ్‌మాస్టర్లు అంతర్జాతీయ స్థాయిలో దిగ్గజాలను ఓడించడం, భారత చెస్ శక్తిని చాటుతోంది.

భారతదేశంలో అత్యంత సంపన్న చెస్ ప్లేయర్ ఎవరు?

భారతదేశంలో అత్యంత సంపన్న చెస్ ప్లేయర్ విశ్వనాథన్ ఆనంద్. 1988లో ఆయన భారతదేశానికి తొలి గ్రాండ్‌మాస్టర్‌గా గుర్తింపు పొందారు.

ప్రజ్ఞానందా కుటుంబ నేపథ్యం ఏమిటి?

ఆర్. ప్రజ్ఞానందా 2005 ఆగస్టు 10న తమిళనాడు, చెన్నైలోని తమిళ భాషా కుటుంబంలో జన్మించాడు. ఆయన తండ్రి రమేశ్‌బాబు, టీఎన్‌ఎస్‌సీ బ్యాంక్‌లో బ్రాంచ్ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. తల్లి నాగలక్ష్మి గృహిణి. ఆమె తరచుగా టోర్నమెంట్లకై ప్రయాణించే సమయంలో ప్రజ్ఞానందాకు తోడుగా వెళ్తుంటారు. ప్రజ్ఞానందాకు ఓ అక్క కూడా ఉంది. ఆమె పేరు వైషాలి, ఆమె కూడా అంతర్జాతీయ స్థాయిలో చెస్ ప్లేయర్‌గానే గుర్తింపు పొందింది.

Read hindi news: hindi.vaartha.com

Read Also: Deepti Sharma: వావ్..ఒంటిచేత్తో సిక్సు బాదిన దీప్తి శర్మ

Chess D Gukesh Freestyle ChessBreaking News Grand Chess Tour Indian grandmasters latest news Magnus Carlsen Praggnanandhaa Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.