📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ట్రంప్ ప్రకటనలో భారీగా తగ్గనున్న మందుల ధర ఢాకాలో హింస.. పత్రికల కార్యాలయాలపై దాడులు కుప్పకూలిన విమానం.. ప్రముఖ రేసర్ కన్నుమూత బంగ్లాదేశ్ లో దారుణం ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం ట్రంప్ ప్రకటనలో భారీగా తగ్గనున్న మందుల ధర ఢాకాలో హింస.. పత్రికల కార్యాలయాలపై దాడులు కుప్పకూలిన విమానం.. ప్రముఖ రేసర్ కన్నుమూత బంగ్లాదేశ్ లో దారుణం ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం

World Bank Report: భారత్‌లో భారీగా తగ్గిన పేదరికం: వరల్డ్ బ్యాంకు నివేదిక

Author Icon By Shobha Rani
Updated: June 7, 2025 • 11:36 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ప్రపంచ బ్యాంకు (World Bank) ఇటీవల విడుదల చేసిన నివేదిక ప్రకారం, భారతదేశం గత 10-11 సంవత్సరాల్లో తీవ్ర పేదరికాన్ని గణనీయంగా తగ్గించగలిగింది. ఇది దేశ ఆర్థిక అభివృద్ధికి, ప్రభుత్వ చర్యల విజయానికి అద్దం పడుతోంది. గత దశాబ్ద కాలంలో దేశంలో తీవ్ర పేదరికం గణనీయంగా తగ్గిందని ప్రపంచ బ్యాంకు (World Bank) విడుదల చేసిన తాజా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వ విధానాలు ఈ మార్పునకు దోహదపడ్డాయని ఈ నివేదిక పేర్కొంది. ప్రపంచ బ్యాంకు వెల్లడించిన సమాచారం ప్రకారం… 2011-12 సంవత్సరంలో భారతదేశంలో తీవ్ర పేదరికం రేటు 27.1 శాతంగా ఉండగా, 2022-23 నాటికి ఇది కేవలం 5.3 శాతానికి పడిపోయింది. ఈ గణాంకాలు దేశ ఆర్థిక ప్రగతికి, ప్రభుత్వ పథకాల ఫలవంతమైన అమలుకు అద్దం పడుతున్నాయి. సంఖ్యాపరంగా చూస్తే, 2011-12లో 344.47 మిలియన్ల మంది ప్రజలు తీవ్ర పేదరికంలో జీవించగా, 2022-23 నాటికి ఈ సంఖ్య 75.24 మిలియన్లకు తగ్గింది. అంటే, సుమారు 11 సంవత్సరాల వ్యవధిలో దాదాపు 269 మిలియన్ల మంది ప్రజలు తీవ్ర పేదరికం నుంచి బయటపడ్డారు. ఈ తగ్గుదల గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో సమానంగా కనిపించిందని ప్రపంచ బ్యాంకు తెలిపింది.

World Bank Report: భారత్‌లో భారీగా తగ్గిన పేదరికం: వరల్డ్ బ్యాంకు నివేదిక

తీవ్ర పేదరికంలో గ్రామీణ ప్రాంతాల్లో 85% తగ్గుదల
రోజుకు 3 డాలర్ల (2021 ధరల ప్రకారం) అంతర్జాతీయ పేదరిక రేఖను ప్రామాణికంగా తీసుకుని ఈ అంచనాలు రూపొందించారు. గ్రామీణ ప్రాంతాల్లో తీవ్ర పేదరికం 18.4 శాతం నుంచి 2.8 శాతానికి తగ్గగా, పట్టణ ప్రాంతాల్లో ఇది 10.7 శాతం నుంచి 1.1 శాతానికి చేరిందని తాజా డేటా వెల్లడించింది. దేశంలో గతంలో అధిక సంఖ్యలో పేదలున్న ఉత్తర ప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్, పశ్చిమ బెంగాల్, మధ్య ప్రదేశ్ రాష్ట్రాలు ఈ మొత్తం పేదరిక తగ్గుదలలో మూడింట రెండు వంతుల వాటాను అందించడం గమనార్హం. 2011-12లో దేశంలోని మొత్తం తీవ్ర పేదలలో 65 శాతం మంది ఈ రాష్ట్రాల్లోనే ఉండేవారు. భారతదేశం బహుముఖ పేదరిక సూచిక (MPI)లో కూడా విశేషమైన పురోగతిని సాధించింది. ఆరోగ్యం, విద్య, జీవన ప్రమాణాలను పరిగణనలోకి తీసుకునే ఈ సూచిక 2005-06లో 53.8 శాతంగా ఉండగా, 2019-21 నాటికి 16.4 శాతానికి, 2022-23 నాటికి మరింతగా 15.5 శాతానికి తగ్గింది.
బహుముఖ పేదరిక సూచికలో ప్రగతి
కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం 11 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న తరుణంలో పేదరిక నిర్మూలనకు, ప్రజల సాధికారతకు, మౌలిక సదుపాయాల కల్పనకు, సమ్మిళిత వృద్ధికి ప్రభుత్వం చేపట్టిన విప్లవాత్మక చర్యలను ప్రధాని మోదీ పలు సందర్భాల్లో ప్రస్తావించారు. పీఎం ఆవాస్ యోజన, పీఎం ఉజ్వల యోజన, జన్ ధన్ యోజన, ఆయుష్మాన్ భారత్ వంటి పథకాలు గృహ వసతి, పరిశుభ్రమైన వంట ఇంధనం, బ్యాంకింగ్ సేవలు, ఆరోగ్య సంరక్షణ వంటివి ప్రజలకు అందుబాటులోకి తెచ్చాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. అలాగే ప్రత్యక్ష ప్రయోజన బదిలీ (DBT), డిజిటల్ సమ్మిళితత, గ్రామీణ మౌలిక సదుపాయాల కల్పన వంటివి పారదర్శకతను పెంచి, లబ్ధిదారులకు ప్రయోజనాలు వేగంగా చేరేలా చేశాయి. తద్వారా 26 కోట్లకు పైగా ప్రజలు పేదరికాన్ని జయించడానికి దోహదపడ్డాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

Read Also: Mirza: భారత్‌ జెట్స్‌ను కూల్చేశాం.. షంషద్‌ మీర్జా

Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Poverty has reduced significantly in India: Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news World Bank report

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.