📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Adult Videos: నేపాల్ లో ఏం జరిగిందో తెలుసుగా? పోర్న్ బాన్ పై సుప్రీమ్ కోర్ట్

Author Icon By Shiva
Updated: November 4, 2025 • 2:47 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఇంటర్నెట్‌లో విపరీతంగా పెరుగుతున్న అశ్లీల కంటెంట్‌పై నిషేధం విధించాలంటూ సుప్రీంకోర్టులో ఒక కీలక పిటిషన్ దాఖలైంది. ఈ కంటెంట్ వల్ల చిన్నపిల్లల మనస్తత్వం దెబ్బతింటుందని, సమాజంపై దీని ప్రభావం తీవ్రంగా ఉంటుందని పిటిషనర్ ఆవేదన వ్యక్తం చేశారు.ఈ పిటిషన్‌పై సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని డివిజనల్ బెంచ్ విచారణ జరిపింది. విచారణ సందర్భంగా కోర్టు నేపాల్‌లో జరిగిన Gen Z నిరసనలను ప్రస్తావిస్తూ, “అక్కడ ఇంటర్నెట్ సైట్లపై నిషేధం విధించడం వల్ల ఏ పరిస్థితులు ఏర్పడ్డాయో చూశాం కదా?” అనివ్యాఖ్యానించింది. అనంతరం, కేసు విచారణను నాలుగు వారాలపాటు వాయిదా వేసింది. సీజేఐ జస్టిస్ గవాయ్ ఈ నెల 23న పదవీ విరమణ చేయనున్నందున, ఈ పిటిషన్‌పై ఆయన పూర్తి విచారణ చేపట్టకపోవచ్చని న్యాయవర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

Read Also : Indian Women’s Cricket: టీమిండియా అమ్మాయిల వార్షిక జీతాలు ఎంతో తెలుసా?

Read Also: Bangalore: ప్రియురాలి కోసం భార్యను చంపిన బెంగళూరు వైద్యుడు

పిటిషనర్ వాదనలు:
డిజిటలైజేషన్ కారణంగా దేశవ్యాప్తంగా ఇంటర్నెట్ వాడకం విపరీతంగా పెరిగిందని, చిన్నారుల నుంచి పెద్దల దాకా అందరూ మొబైల్, ట్యాబ్లెట్, ల్యాప్‌టాప్‌ల ద్వారా ఆన్‌లైన్ కంటెంట్‌కి సులభంగా పెరిగిందని పిటిషనర్ తెలిపారు. ముఖ్యంగా కోవిడ్ తర్వాత పిల్లల్లో మొబైల్ వాడకం అధికమైందని, దీని ఫలితంగా అశ్లీల కంటెంట్ సులభంగా అందుబాటులోకి వస్తోందని చెప్పారు.

ఇంటర్నెట్‌లో అశ్లీల వీడియోలు, క్లిప్పులు విచ్చలవిడిగా ఉండటంతో పిల్లల మనసులు కలుషితమవుతున్నాయని, ఇది భవిష్యత్తులో పెద్ద సామాజిక సమస్యగా మారే అవకాశం ఉందని పిటిషనర్ హెచ్చరించారు.

ప్రభుత్వంపై ప్రశ్నలు:
దేశంలో 20 కోట్లకు పైగా అశ్లీల వీడియోలు, క్లిప్పులు ఆన్‌లైన్‌లో అమ్మకానికి ఉన్నాయని, ఈ సైట్లను కేంద్రం ఎందుకు నియంత్రించడం లేదని పిటిషనర్ ప్రశ్నించారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టంలోని సెక్షన్ 69(A) ప్రకారం ఇలాంటి సైట్లను నిషేధించవచ్చని, కానీ ప్రభుత్వం ఈ దిశగా ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు.

దేశవ్యాప్తంగా అశ్లీల కంటెంట్‌ నియంత్రణకు సంబంధించిన సమగ్ర జాతీయ విధానం తీసుకురావాలని, ఇందుకోసం కేంద్రాన్ని ఆదేశించాలంటూ కోర్టును అభ్యర్థించారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Breaking News in Telugu BreakingNews BRSupremeCourt IndiaNews InternetRegulation ObsceneContent PornBanPetition SupremeCourt

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.