📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు

Pollachi : పొల్లాచ్చి కేసు.. 9 మంది నిందితులను దోషులుగా తేల్చిన కోర్టు

Author Icon By Shobha Rani
Updated: May 15, 2025 • 11:43 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తమిళనాడులోని పొల్లాచ్చి (Pollachi) లైంగిక వేధింపుల కేసులో కోయంబత్తూరు (Koyambathur) సెషన్స్ కోర్టు 9 మంది నిందితులను దోషులుగా నిర్ధారించింది. కోయంబత్తూరు (Koyambathur) మహిళా కోర్టు ఈ కేసును విచారించింది. 2019 నాటి ఈ కేసులో, ఒక కళాశాల విద్యార్థినితో సహా 9 మంది మహిళలపై లైంగిక వేధింపులు, బ్లాక్ మెయిల్ ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. దీంతో 9 మందిని కోయంబత్తూరు (Koyambathur) పోలీసులు అరెస్టు చేశారు. కోర్టు ఈ నిందితులను దోషులుగా నిర్ధారించింది. త్వరలో వీరికి శిక్షను ఖరారు చేయనుంది కోర్టు. 2019 ఫిబ్రవరిలో వెలుగులోకి వచ్చిన ఈ కేసులో, ఓ విద్యార్థి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు విచార‌ణ చేప‌ట్టారు. నిందితులంతా ఒక కాలేజీ విద్యార్థినితో పాటు మరో 9 మంది మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. వారిని నగదు కోసం బ్లాక్ మెయిల్ చేసినట్లు విచారణలో రుజువైంది. నేర‌పూరిత కుట్ర, లైంగిక వేధింపులు, అత్యాచారం, సామూహిక అత్యాచారం, బెదిరింపుల‌కు పాల్పడిన‌ట్లు నిందితుల‌పై ఆరోప‌ణ‌లు ఉన్నాయి.

Pollachi : పొల్లాచ్చి కేసు.. 9 మంది నిందితులను దోషులుగా తేల్చిన కోర్టు

దర్యాప్తు – సీబీఐ చేతికి కేసు బదిలీ
పొల్లాచ్చి లైంగిక వేధింపుల కేసును మొదట క్రైమ్ బ్రాంచ్ దర్యాప్తు చేసింది. దీని తరువాత, ఈ విషయంపై పెరుగుతున్న ప్రజా ఆగ్రహాన్ని చూసి, కేసును సిబిఐకి అప్పగించారు. ఈ మొత్తం కేసులో, పబ్లిక్ ప్రాసిక్యూటర్ 50 మందికి పైగా సాక్షులను విచారించి, 200 కి పైగా పత్రాలను సమర్పించారు. డిజిటల్ ఆధారాలను కూడా సమర్పించారు. 2016 నుంచి 2018 వ‌ర‌కు అమ్మాయిల‌ను బ్లాక్‌మెయిల్ చేసిన‌ట్లు కూడా ఆరోప‌ణ‌లు ఉన్నాయి. తొలుత ఈ కేసును తమిళనాడు క్రైమ్ బ్రాంచ్ – క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్ దర్యాప్తు చేసింది. ఆ తర్వాత CBIకు కేసును బదిలీ చేశారు.2019 ఏప్రిల్‌లో రెండు FIRలు నమోదు చేసిన సీబీఐ, 2021లో మరో ముగ్గురిని అరెస్ట్ చేసింది. ఈ కేసు తమిళనాడులో రాజకీయంగా సున్నితమైన అంశంగా మారడంతో, మహిళల భద్రతపై దేశవ్యాప్తంగా చర్చలకు దారితీసింది.
న్యాయమూర్తి నందినీ దేవి తీర్పు
నిజానికి పొల్లాచ్చి లైంగిక వేధింపుల కేసు 2019 నాటిది. ఇందులో, ముఠాగా ఏర్పడ్డ పురుషులు, మొదట మహిళలతో స్నేహం చేస్తారు. ఆపై వారిని వలలో వేసుకుని లైంగికంగా దాడి చేస్తారు. నిందితులు ఈ మహిళలను బ్లాక్ మెయిల్ కూడా చేసేవారు. మక్కినంపట్టికి చెందిన తిరునావుక్కరసు, జ్యోతి నగర్‌కు చెందిన శబరిరాజన్, సతీష్, వసంతకుమార్, ఎం. సతీష్, టి.వసంతకుమార్, ఆర్.మణి అలియాస్ మణివణ్ణన్, పి.బాబు, టి.హరోనిమస్ పాల్, అరుళానందం, ఎం.అరుణ్‌కుమార్‌లకు ఈ ఆరోపణలతో న్యాయస్థానం సమన్లు ​​జారీ చేసింది. మహిళా కోర్టు న్యాయమూర్తి నందినీ దేవి అనేక సెక్షన్ల కింద నిందితులందరినీ దోషులుగా నిర్ధారించారు.
విద్యార్థినిపై దాడి నుంచే విచారణకు ఆరంభం
ఈ కేసులో మొదటి ఫిర్యాదు ఒక కళాశాల విద్యార్థి చేసింది. దీని తరువాత పోలీసులు ఫిర్యాదు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఇలాంటి కేసుల వెనుక ఒక ముఠా మొత్తం పని చేసి ఈ రాకెట్‌ను నడుపుతున్నట్లు దర్యాప్తులో తేలింది. ఈ కేసు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. సున్నితమైన అంశాన్ని తమిళనాడు పోలీసులు ప్రతిష్టాత్మకంగా తీసుకుని దర్యాప్తు చేపట్టింది. చివరికి కోర్టు 9మంది నిందితులను దోషులుగా నిర్ధారించింది. త్వరలో వీరికి శిక్షను ఖరారు చేయనుంది కోర్టు. కాగా, వారి వయస్సు, వారి తల్లిదండ్రుల వృద్ధాప్యాన్ని పేర్కొంటూ క్షమాభిక్ష కోరుతున్నారు. అయితే, ఇది మహిళలపై దారుణమైన నేరాలకు సంబంధించిన చాలా అరుదైన అరుదైన కేసు అని వాదించామని, గరిష్ట శిక్షను కోరుతున్నామని పబ్లిక్ ప్రాసిక్యూటర్ సురేంద్ర మోహన్ అన్నారు.

Read Also: Droupadi Murmu: ‘పాకెట్ వీటో’ వివాదం.. రాష్ట్రపతి లేఖ vs సుప్రీంకోర్టు తీర్పు

Breaking News in Telugu Court found 9 accused guilty Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Pollachi case.. Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.