📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన

Gaurav Kundi: ఆస్ట్రేలియాలో భారత సంతతి వ్యక్తిపై పోలీసుల దాడి

Author Icon By Shobha Rani
Updated: June 3, 2025 • 10:54 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆస్ట్రేలియాలో భారత సంతతికి చెందిన గౌరవ్ కుండి (Gaurav Kundi) (42) అనే వ్యక్తి పోలీసుల చర్యల కారణంగా తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు. అడిలైడ్‌లో జరిగిన ఈ ఘటనలో, పోలీసులు అతడిని కిందపడేసి, మెడపై మోకాలితో నొక్కినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ దాడిలో మెదడుకు తీవ్ర గాయాలు కావడంతో ప్రస్తుతం గౌరవ్ కుండి లైఫ్ సపోర్ట్‌పై ఉన్నారు. గౌరవ్ కుండి (Gaurav Kundi) మరియు ఆయన భార్య అమృత్‌పాల్ కౌర్‌ మధ్య జరిగిన వాగ్వాదాన్ని గృహ హింసగా పొరబడి, అక్కడికి చేరుకున్న పోలీసులు హఠాత్తుగా అరెస్ట్‌కు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. అమృత్‌పాల్ మాట్లాడుతూ, “అతడు కేవలం మద్యం మత్తులో అరవటం తప్ప, ఎలాంటి హింసాత్మక చర్యలకూ పాల్పడలేదు” అని చెప్పినప్పటికీ, పోలీసులు వినిపించుకోలేదని ఆరోపించారు. ఇద్దరు పిల్లల తండ్రి అయిన గౌరవ్ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. అడిలైడ్ తూర్పు శివార్లలో గౌరవ్ కుండి (Gaurav Kundi), ఆయన భార్య అమృత్‌ పాల్ కౌర్ బహిరంగంగా వాగ్వాదానికి దిగారు. ఆ సమయంలో అటుగా వెళ్తున్న పెట్రోలింగ్ పోలీసులు ఈ ఘటనను గృహ హింసగా పొరబడ్డారని తెలుస్తోంది. తన భర్త మద్యం మత్తులో గట్టిగా అరుస్తున్నాడే తప్ప, హింసాత్మకంగా ప్రవర్తించడం లేదని అమృత్‌పాల్ పోలీసులకు చెప్పినప్పటికీ వారు వినిపించుకోలేదని సమాచారం.

Gaurav Kundi: ఆస్ట్రేలియాలో భారత సంతతి వ్యక్తిపై పోలీసుల దాడి

కుటుంబ విబేధాన్ని గృహ హింసగా భావించిన పోలీసులు
అరెస్టు చేసే క్రమంలో కుండి తీవ్రంగా ప్రతిఘటించాడని, ఆ తర్వాత నేలపై పడిపోయి స్పృహ కోల్పోయాడని పోలీసులు మీడియాకు తెలిపారు. ఈ ఘర్షణను అమృత్‌పాల్ తన ఫోన్‌లో చిత్రీకరించారు. పోలీసు కారు వద్దకు కుండి (Gaurav Kundi) ని తీసుకెళ్లి నిర్బంధించడానికి పలువురు అధికారులు ప్రయత్నిస్తున్నప్పుడు, “నేను ఏ తప్పూ చేయలేదు” అని ఆయన గట్టిగా అరిచినట్లు వీడియో ఫుటేజ్‌లో ఉందని పేర్కొంది. తన భర్తను వదిలేయాలని, పోలీసులు అన్యాయంగా ప్రవర్తిస్తున్నారని అమృత్‌పాల్ ఏడుస్తూ చెప్పిన దృశ్యాలు కూడా అందులో ఉన్నాయి. ఇది అమెరికాలో 2020లో జార్జ్ ఫ్లాయిడ్ ఘటనను గుర్తుకు తెస్తోందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. “పోలీసు అధికారి మోకాలితో నొక్కినప్పుడు భయపడి వీడియో తీయడం ఆపేశాను. అరెస్టు సమయంలో కుండి తలను పోలీసు కారుకు, రోడ్డుకు బాదారు,” అని అమృత్‌పాల్ మీడియాకు వివరించారు. రాయల్ అడిలైడ్ ఆసుపత్రికి తరలించగా, కుండి మెదడుకు, మెడ నరాలకు తీవ్ర గాయాలైనట్లు వైద్యులు నిర్ధారించారు. ఆయన కోమా నుంచి బయటపడతారో లేదోనని కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఈ ఘటనపై సౌత్ ఆస్ట్రేలియా పోలీసులు అంతర్గత విచారణ ప్రారంభించారు. బాడీ-కెమెరా ఫుటేజ్‌ను సమీక్షిస్తున్నట్లు తెలిపారు. ప్రాథమిక ఆధారాల ప్రకారం తమ అధికారులు సరైన విధంగానే ప్రవర్తించారని తాత్కాలిక అసిస్టెంట్ కమిషనర్ జాన్ డికాండియా అన్నట్లు స్థానిక మీడియా పేర్కొంది. అయితే, ఇది ఒక అధికారి కోణం మాత్రమేనని, పూర్తి విచారణ జరుగుతోందని ఆయన స్పష్టం చేశారు. సౌత్ ఆస్ట్రేలియా పోలీసులు ఈ ఘటనపై అంతర్గత విచారణ చేపట్టారు. అధికారుల బాడీ కెమెరా ఫుటేజ్‌ను సమీక్షిస్తున్నట్లు తెలిపారు. తాత్కాలిక అసిస్టెంట్ కమిషనర్ జాన్ డికాండియా మాట్లాడుతూ, “ప్రాథమికంగా మా అధికారుల ప్రవర్తన నిబంధనల ప్రకారమే ఉంది” అని పేర్కొన్నారు. అయితే, ఇది కేవలం ప్రాథమిక అభిప్రాయమేనని, పూర్తి విచారణ అనంతరం నిజం వెలుగులోకి వస్తుందని స్పష్టం చేశారు.

Read Also: Ukraine: రష్యా వైమానిక స్థావరాలపై ఉక్రెయిన్ స్పైడర్ వెబ్ దాడి

https://twitter.com/TO_VICTORY_WFP2/status/1929720780759486867

Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu origin man in Australia Paper Telugu News Police attack on Indian- Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.