📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Latest News: PM Modi: గాజా విషయం లో ట్రంప్‌ చేస్తున్న ప్రయత్నాలను ప్రశంసించిన ప్రధాని మోదీ

Author Icon By Anusha
Updated: October 4, 2025 • 10:54 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

గాజాలో శాంతి స్థాపన కోసం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తీసుకున్న నిర్ణయాత్మక చర్యలను భారత ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) ప్రశంసించారు. హమాస్ తమ ఆధీనంలో ఉన్న ఇజ్రాయెల్ బందీలను విడుదల చేయడానికి అంగీకరించిన నేపథ్యంలో మోదీ చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయ వేదికపై చర్చనీయాంశమయ్యాయి. ఈ పరిణామం గాజా ప్రాంతంలో నెలకొన్న ఉద్రిక్తతలను కొంతమేర తగ్గించే అవకాశముందని నిపుణులు భావిస్తున్నారు.

Upendra Dwivedi :సైన్యాధిపతి ద్వివేది ఘాటు హెచ్చరిక

ఈ పరిణామంపై ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. గాజా (Gaza) లో శాంతి ప్రయత్నాలకు నిర్ణయాత్మక పురోగతి సాధించినందుకు గాను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నాయకత్వాన్ని భారత్ స్వాగతిస్తోందని అన్నారు.

బందీల విడుదలకు లభించిన అంగీకారం శాంతి స్థాపన దిశగా ముందుకు వేసిన ఒక కీలక ముందడుగు అని తెలిపారు. శాశ్వతమైన, న్యాయమైన శాంతి పునరుద్ధరణ కోసం చేసే అన్ని ప్రయత్నాలకు భారత్ ఎల్లప్పుడూ గట్టి మద్దతు ఇస్తూనే ఉంటుందని మోదీ ట్వీట్ చేశారు.

భీకర యుద్ధానికి త్వరలోనే ముగింపు

గత రెండేళ్లుగా హమాస్, ఇజ్రాయెల్ (Israel) మధ్య కొనసాగుతున్న భీకర యుద్ధానికి త్వరలోనే ముగింపు పలకబోతున్నట్లు బలమైన అవకాశాలు కనిపిస్తున్నాయి. ట్రంప్ ప్రవేశ పెట్టిన శాంతి ప్రణాళికను అంగీకరించకపోతే అంతా నరకమే చూడాల్సి వస్తుందన్న డొనాల్డ్ ట్రంప్ చేసిన గట్టి హెచ్చరికల నేపథ్యంలో.. హమాస్ మెట్టు దిగింది.

తమ వద్ద ఉన్న ఇజ్రాయెల్‌ బందీలను వదిలి పెట్టడానికి సిద్ధమైంది. అయితే అందుకు బదులుగా గాజాపై నెతన్యాహు (Netanyahu) సేనలు వెంటనే దాడులు ఆపాలని హమాస్ (Hamas) డిమాండ్ చేసింది. ట్రంప్ సూచించిన ప్రతిపాదనల్లో కొన్నింటిని అంగీకరించిన హమాస్.. మిగిలిన అంశాలపై చర్చలు జరిపేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ప్రకటించింది.

తక్షణమే చర్చలు ప్రారంభిస్తామని హమాస్ వెల్లడించింది

ఈ మేరకు మధ్యవర్తులతో తక్షణమే చర్చలు ప్రారంభిస్తామని హమాస్ వెల్లడించింది.అంతేకాకుండా గాజా పరిపాలనను పాలస్తీనా (Palestine) టెక్నోక్రాట్స్‌కు అప్పగించేందుకు సిద్ధమని కూడా హమాస్ ప్రకటించింది. ఈ శాంతి ప్రణాళికకు మద్దతు ఇస్తున్న అరబ్, ఇస్లామిక్ దేశాలతో పాటు అంతర్జాతీయ భాగస్వాములకు, డొనాల్డ్ ట్రంప్‌నకు హమాస్ కృతజ్ఞతలు తెలిపింది.

ఈ తాజా పరిణామాలపై డొనాల్డ్ ట్రంప్ కూడా తన సామాజిక మాధ్యమం ‘ట్రూత్’ (‘Truth’) లో స్పందించారు. శాంతి నెలకొల్పేందుకు హమాస్ సిద్ధంగా ఉన్నట్లు తాను నమ్ముతున్నానని ఆయన ధీమా వ్యక్తం చేశారు. గాజాలో దాడులను ఇజ్రాయెల్ వెంటనే ఆపాలని సూచించారు.

బందీలను క్షేమంగా, త్వరగా విడిపించవచ్చని

అలా చేస్తేనే బందీలను క్షేమంగా, త్వరగా విడిపించవచ్చని పేర్కొన్నారు.దాడులు కొనసాగితే పరిస్థితి ప్రమాదకరంగా మారుతుందని ఆయన హెచ్చరించారు. “పరిష్కరించాల్సిన అంశాలపై మేము ఇప్పటికే చర్చలు జరుపుతున్నాం.

ఇది కేవలం గాజా గురించి మాత్రమే కాదు, మధ్యప్రాచ్యంలో చాలా కాలంగా కోరుకుంటున్న శాంతి గురించి” అంటూ ట్రంప్ తన పోస్టులో రాసుకొచ్చారు. ఈ పరిణామాలు త్వరలోనే ఈ సుదీర్ఘ యుద్ధానికి తెర దించుతాయనే ఆశాభావాన్ని రేకెత్తిస్తున్నాయి.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

Breaking News Donald Trump Gaza peace progress Hamas hostages release Israel Hamas Conflict latest news Modi praises Trump Narendra Modi Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.