రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (Vladimir Putin) 73వ జన్మదినం సందర్భంగా భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Modi) ఫోన్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మోదీ, పుతిన్‌కి “మీరు ఆరోగ్యంగా ఉండాలి, మీ అన్ని ప్రయత్నాలు విజయవంతం కావాలి” అని ఆకాంక్షించారు. ఇద్దరు నేతల మధ్య జరిగిన ఈ సంభాషణలో స్నేహపూర్వకత, పరస్పర గౌరవం స్పష్టంగా కనిపించింది.
Annamalai: రాజ్యసభ సీటు తో కమల్ అమ్ముడుపోయారు: అన్నామలై
ఇండియా–రష్యా మధ్య ఉన్న బలమైన సంబంధాలను ఈ సందర్భం మరింత బలపరిచిందని అధికారులు తెలిపారు.డిసెంబర్‌లో జరగనున్న 23వ భారత్-రష్యా వార్షిక సదస్సు కోసం పుతిన్‌ను భారత్‌కు సాదరంగా ఆహ్వానిస్తున్నట్లు మోదీ తెలిపారు. ఆయన రాక కోసం ఎదురుచూస్తున్నట్లు పేర్కొన్నారు.
ఇరు దేశాల మధ్య ఉన్న ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు కట్టుబడి ఉన్నామని ఇరువురు నేతలు పునరుద్ఘాటించారు.ఇటీవల సోచిలో జరిగిన వల్దాయి డిస్కషన్ క్లబ్ (Valdai Discussion Club) సమావేశంలో పుతిన్ ప్రధాని మోదీపై ప్రశంసల వర్షం కురిపించిన విషయం తెలిసిందే. మోదీని ‘సమర్థుడైన, వివేకవంతమైన నాయకుడు’ అని పుతిన్ అభివర్ణించారు.
రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేయడం
రష్యా (Russia) నుంచి భారత్ చమురు కొనుగోలు చేయడం వెనుక ఎలాంటి రాజకీయ కారణాలు లేవని, అది పూర్తిగా ఆర్థికపరమైన నిర్ణయమని ఆయన స్పష్టం చేశారు.”భారత్ మా నుంచి ఇంధన సరఫరాలను తిరస్కరిస్తే నష్టపోతుంది. అలా కాదని కొనుగోలు చేస్తే ఆంక్షలు విధిస్తామని బెదిరిస్తారు. ఈ రెండు సందర్భాల్లోనూ నష్టం తప్పదు.
అలాంటప్పుడు దేశీయంగా రాజకీయ నష్టాన్ని కూడా తెచ్చిపెట్టే నిర్ణయం ఎందుకు తీసుకుంటారు?” అని పుతిన్ (Putin) ప్రశ్నించారు.బయటి శక్తుల ఒత్తిళ్లకు భారత్, ముఖ్యంగా మోదీ నాయకత్వం ఎన్నటికీ తలవంచదని ఆయన ధీమా వ్యక్తం చేశారు. “నాకు ప్రధాని మోదీ తెలుసు, ఆయన అలాంటి చర్యలకు పాల్పడరు.
భారతదేశ ప్రజలు తమ నాయకత్వం తీసుకునే నిర్ణయాలను నిశితంగా గమనిస్తారు, ఎవరి ముందు అవమానపడటానికి అంగీకరించరు” అని పుతిన్ వ్యాఖ్యానించారు. భారత్‌తో రష్యాకు ఎన్నడూ ఎలాంటి సమస్యలు లేవని, చారిత్రక బంధం ఉందని గుర్తుచేశారు. అక్టోబర్ 3వ తేదీతో ఇరు దేశాల వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందానికి 25 ఏళ్లు పూర్తవడం గమనార్హం.
Read hindi news: hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read Also: