PM Modi: భారత ప్రధాని నరేంద్ర మోదీ రేపటి నుంచి రెండు రోజుల పాటు ఇజ్రాయెల్‌లో పర్యటించనున్నారు. 2017లో తొలిసారి ఆ దేశాన్ని సందర్శించిన ఆయన, దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత మళ్లీ పర్యటనకు వెళ్తున్నారు. ఈ సందర్శన భారత్–ఇజ్రాయెల్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Read also:Nitish Kannan: భారతీయులపై అమెరికాలో రేసిస్టు ట్రోల్..దిగ్గజ కంపెనీ సీఈఓ స్పందన
పార్లమెంట్‌లో ప్రసంగం – చరిత్ర సృష్టించనున్న మోదీ
బుధవారం టెల్ అవీవ్ చేరుకున్న వెంటనే ప్రధాని మోదీకి ఘన స్వాగతం లభించనుంది. అనంతరం ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో ప్రత్యేక సమావేశం జరుగుతుంది. ఇజ్రాయెల్ పార్లమెంట్‌ను ఉద్దేశించి ప్రసంగించనున్న తొలి భారతీయ నేతగా మోదీ రికార్డు నెలకొల్పనున్నారు. అక్కడ నివసిస్తున్న భారత సంతతి ప్రజలతో కూడా ఆయన భేటీ కానున్నారు. రెండో రోజు జెరూసలేం లోని యాద్ వాషెమ్ హోలోకాస్ట్ స్మారకాన్ని సందర్శించి యూదుల బాధితులకు నివాళులు అర్పిస్తారు. అనంతరం ఇజ్రాయెల్ అధ్యక్షుడు ఐజాక్ హెర్జోగ్‌తో భేటీ అవుతారు.
టెక్నాలజీ, రక్షణ రంగాల్లో కీలక ఒప్పందాలు
ఈ పర్యటనలో కృత్రిమ మేధ, సైబర్ భద్రత, క్వాంటం టెక్నాలజీ వంటి రంగాల్లో కీలక ఒప్పందాలపై సంతకాలు జరిగే అవకాశం ఉంది. రక్షణ రంగంలో దాదాపు 8.6 బిలియన్ డాలర్ల విలువైన ఒప్పందాలు కుదిరే అవకాశం ఉందని సమాచారం. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో భారత్, ఇజ్రాయెల్ ఒకే దృక్పథంతో ఉన్నాయని భారత రాయబారి జేపీ సింగ్ తెలిపారు. ఈ పర్యటన సైన్స్, టెక్నాలజీ, ఇన్నోవేషన్ రంగాల్లో ఇరు దేశాలను మరింత దగ్గర చేస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: