📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Latest News: PM Modi: రష్యా చమురు అంశంపై విదేశాంగ శాఖ క్లారిటీ

Author Icon By Aanusha
Updated: October 16, 2025 • 11:08 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) చేసిన వ్యాఖ్యలు మరోసారి భారత్‌–అమెరికా సంబంధాలను చర్చనీయాంశంగా మార్చాయి. ఇటీవల ట్రంప్ మాట్లాడుతూ, “భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) రష్యా నుంచి చమురు కొనుగోలు నిలిపివేయడానికి అంగీకరించారు” అని ప్రకటించగా, ఈ వ్యాఖ్యలు అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించాయి. అయితే, భారత విదేశాంగ శాఖ ఈ వ్యాఖ్యలను పూర్తిగా ఖండిస్తూ, ఇలాంటి ఎటువంటి ఫోన్ సంభాషణ ఇద్దరు దేశాధినేతల మధ్య జరగలేదని స్పష్టం చేసింది.

Read Also: Johnson’s Company:జాన్సన్ కంపెనీ బేబీ పౌడర్‌ సంస్థపై కోట్లకు దావా

విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ (Randhir Jaiswal) స్పష్టం చేశారు. ఈ విషయంపై భారత్ ఇదివరకే ఒక స్పష్టతనిచ్చిందని ఆయన తెలిపారు.రష్యా నుంచి చమురు కొనుగోలు నిలిపివేసేందుకు నరేంద్ర మోదీ (PM Modi) అంగీకరించారని ట్రంప్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం కాగా, భారత్ ఈ వ్యాఖ్యలను ఖండించింది.ఇదివరకే కేంద్రం ఒక ప్రకటన విడుదల చేసింది.

దేశ ప్రజల ప్రయోజనాలు తమకు ముఖ్యమని, వీటి ఆధారంగానే దిగుమతులు ఉంటాయని స్పష్టం చేసింది. అమెరికా నుంచి చమురు దిగుమతులు పెంచడానికి గత కొన్నేళ్లుగా ప్రయత్నాలు చేస్తున్నామని, గత దశాబ్ద కాలంలో ఈ విషయంలో చాలా పురోగతి కనిపించిందని ఆ ప్రకటనలో పేర్కొంది.

PM Modi

అంతర్గత వైఫల్యాలకు పొరుగు దేశాలను నిందించడం

ఆఫ్ఘనిస్థాన్-పాకిస్థాన్ మధ్య జరుగుతున్న ఘర్షణలపై కూడా భారత్ స్పందించింది. ఉగ్రవాద సంస్థలకు పాకిస్థాన్ కేంద్రంగా మారిందని ఆరోపించింది. ఉగ్రవాద కార్యకలాపాలను ప్రోత్సహిస్తోందని మండిపడింది.

తమ అంతర్గత వైఫల్యాలకు పొరుగు దేశాలను నిందించడం పాకిస్థాన్‌కు అలవాటుగా మారిందని విమర్శించింది. ఆ రెండు దేశాల మధ్య ఘర్షణల నేపథ్యంలో పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నామని భారత్ పేర్కొంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

Breaking News Donald Trump India Foreign Policy latest news PM Modi Russia Oil Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.