📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

PM Modi: ఘనా పార్లమెంట్‌లో మోదీ ప్రసంగం – “భారతమే ప్రజాస్వామ్యానికి తల్లి”

Author Icon By Sudha
Updated: July 3, 2025 • 5:13 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఘనా పార్లమెంటులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi)ప్రజాస్వామ్యం ప్రాముఖ్యతపై ప్రసంగించారు. భారతదేశాన్ని “ప్రజాస్వామ్యానికి తల్లి”గా అభివర్ణించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో పారదర్శకత, సంభాషణల ప్రాముఖ్యతను ఆయన నొక్కి చెప్పారు. భారతదేశం ప్రజాస్వామ్య విలువలను ప్రపంచానికి ప్రచారం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుందని ఆయన పేర్కొన్నారు. విదేశీ పర్యటనలో ఉన్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గురువారం ఘనా పార్లమెంటులో ప్రసంగించారు. తన ప్రసంగంలో ప్రజాస్వామ్యం ప్రాముఖ్యతను ప్రస్తావించారు. ప్రధాని మోదీ (PM Modi)మాట్లాడుతూ భారతదేశాన్ని “ప్రజాస్వామ్యానికి తల్లి” (Mother of Democracy)గా అభివర్ణించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో భావ వ్యక్తీకరణ, చర్చల ప్రాముఖ్యతను వివరించారు. ప్రధాని మోదీ ఘనా పార్లమెంటును ఉద్దేశించి ఇంగ్లీషులో ప్రసంగించారు. భారతదేశంలో 2,500 కి పైగా రాజకీయ పార్టీలు ఉన్నాయని ప్రధాని మోదీ పేర్కొన్నప్పుడు ఘనా పార్లమెంట్‌లో అందరూ ఆశ్చర్యంతో చిరునవ్వులు చిందించారు.

ఘనా పార్లమెంట్‌లో మోదీ ప్రసంగం – “భారతమే ప్రజాస్వామ్యానికి తల్లి”


సంస్కార్ హై
ప్రధాని మోదీ (PM Modi)తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ.. నేను మళ్ళీ చెబుతున్నాను ఇండియాలో 2,500 రాజకీయ పార్టీలు ఉన్నాయి అని అన్నారు. నిజమైన ప్రజాస్వామ్యం చర్చను ప్రోత్సహిస్తుంది. ఇది ప్రజలను ఏకం చేస్తుంది, గౌరవానికి మద్దతు ఇస్తుంది, మానవ హక్కులను ప్రోత్సహిస్తుంది అని మోదీ అన్నారు.
“హమారే లియే లోక్తంత్ర వ్యవస్థ నహీ, సంస్కార్ హై” అని ప్రధాని మోదీ హిందీలో అన్నారు. ఆ తర్వాత “మాకు ప్రజాస్వామ్యం అనేది ఒక వ్యవస్థ మాత్రమే కాదు, అది మా సంస్కారం” అనే వాక్యాన్ని ఆంగ్లంలో మళ్లీ చెప్పారు. భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థకు బలం చేకూర్చే విధంగా భారతదేశ విస్తారమైన వైవిధ్యాన్ని ప్రస్తావించారు. “వివిధ రాష్ట్రాలను పాలిస్తున్న 20 వేర్వేరు పార్టీలు, 22 అధికారిక భాషలు, వేలాది మాండలికాలు. భారతదేశానికి వచ్చిన ప్రజలను ఎల్లప్పుడూ విశాల హృదయాలతో స్వాగతించడానికి ఇదే కారణం” అని ప్రధాని అన్నారు.
“ఇదే స్ఫూర్తి.. భారతీయులు ఎక్కడికి వెళ్ళినా సులభంగా కలిసిపోవడానికి సహాయపడుతుంది” అని ప్రధాని మోదీ తెలిపారు. ప్రధాని మోదీ ప్రసంగం తర్వాత.. ఘనా పార్లమెంట్ స్పీకర్ అల్బన్ కింగ్స్‌ఫోర్డ్ సుమనా బాగ్బిన్ కూడా “2,500 రాజకీయ పార్టీల” సంఖ్యను రిపీట్‌ చేయడంతో సభలో నవ్వులు పూసాయి.

Read Also: hindi.vaartha.com

Read Also:India: దలైలామా వారసుడిపై చైనా జోక్యం – భారత్‌ ఖండన

#DemocracySpeech #GhanaParliament #IndiaGlobalLeadership #IndiaMotherOfDemocracy #IndianDemocracy #ModiInAfrica #narendramodi #PMModi Breaking News in Telugu Google news India democratic values India mother of democracy Modi Latest News in Telugu Modi Africa visit 2025 Modi foreign policy Africa Modi Ghana parliament address full speech Modi global leadership Paper Telugu News PM Modi democracy speech PM Modi speech Ghana Parliament significance of India in global democracy Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news transparency in democracy Modi speech

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.