నరేంద్ర మోడీ(PM Modi) మూడోసారి ప్రధానమంత్రిగా ప్రమాణం స్వీకారం చేసిన తర్వాత నెలరోజు నుంచి షేక్ హసీనాకు వ్యతిరేకంగా బంగ్లాదేశ్ లో ప్రజలు వీధుల్లోకి వచ్చి పోరాటం మొదలుపెట్టారు. ఈ నిరసనలు ఆగస్టు 5న తీవ్ర హింసాత్మకంగా మారాయి. షేక్ హసీనా తన పాణాలను కాపాడుకోవడానికి భారత్ కు రావాల్సి వచ్చింది. బంగ్లాదేశ్ లో నిరంకుశ పాలనను కొనసాగించారని ఆమెపై ఆరోపణలు ఉన్నాయి. బంగ్లాదేశ్ వ్యవస్థాపకుడిగా పేరున్న హసీనా తండ్రి ముజిబుర్ రెహమాన్ కు, భారత్ తో చారిత్రాత్మక సంబంధాలు ఉన్నాయి.
Read Also: Bangladesh unrest : బంగ్లాదేశ్‌లో ఉద్రిక్తత, గాయకుడు జేమ్స్ కచేరీ రద్దు, రాళ్ల దాడి
షేక్ హసీనా, భారత్(PM Modi) మధ్య సంబంధాలు కూడా అదేవిధంగా కొనసాగాయి. అయితే, భారత్ మద్దతుతోనే షేక్ హసీనా అధికారంలో ఉన్నారని బంగ్లాదేశ్ లోని ప్రతిపక్షాలు, షేక్ హసీనా వ్యతిరేకులు ఆరోపిస్తూ వచ్చారు. గతేడాది ఆగస్టులో షేక్ హసీనాకు భారత్ ఆశ్రయం ఇచ్చిన తర్వాత బంగ్లాదేశ్ లో యాంటీ ఇండియా సెంటిమెంట్ మరింత పెరిగింది. బంగ్లాదేశ్ ను భారత్ ఎప్పుడూ షేక్ హసీనా కుటుంబదృష్టితోనే చూస్తోందని, అంతకు మించి చూసేందుకు ఎప్పుడూ ప్రయత్నించలేదని బంగ్లాదేశ్ మీడియా అంటోంది.
హసీనా విషయంలో దెబ్బతిన్న సంబంధాలు
గతేడాది షేక్ హసీనా ప్రభుత్వం కుప్పకూలిన తర్వాత, తాత్కాలిక ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఈ తాత్కాలిక ప్రభుత్వ పాలనలో ద్వైపాక్షిక సంబంధాలు మరింత దెబ్బతిన్నాయి. గతేడాది డిసెంబర్ నుంచి సంబంధాలు క్షీణించాయి. ‘ఢాకా, దిల్లీ మధ్యలో ఇంత అపనమ్మకం, అనుమానాన్ని నేనెప్పుడూ చూడలేదు. అంతర్జాతీయ నిబంధనల ప్రకారం, ఇరుదేశాలు దౌత్య కార్యాలయాలకు భద్రత కల్పించాలి. రెండు పొరుగుదేశాలు, ఒకదానిపై మరొకటి ఆధారపడి ఉన్నందున భారత వాస్తవాన్ని అంగీకరించి, బంగ్లాదేశ్ తో ఉన్న సంబంధాల విషయంలో నమ్మకాన్ని పునరుద్ధరించే కార్యక్రమాన్ని చేపట్టాలి’ అని మాజీ యూఎస్ అంబాసిడర్ ఎం. హుమాయూన్ కబీర్ ఓ పత్రికలో చెప్పారు. హసీనా భారత్ లో తలదాచుకోవడం బంగ్లాకు ఏమాత్రం ఇష్టం లేదు. ఆమెకు భారత్ మద్దతు ఇవ్వడం బంగ్లా జీర్ణించుకోలేకపోతున్నది. నేరస్తురాలికి మద్దతు ఇస్తున్నదని బంగ్లా భారత్ ను నిందిస్తున్నది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: