📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Latest News: PM Modi: 2026లో భారత్‌లో ‘ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్’

Author Icon By Aanusha
Updated: November 24, 2025 • 8:43 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

దక్షిణాఫ్రికాలోని జొహన్నెస్‌బర్గ్ వేదికగా జరిగిన తాజా G20 శిఖరాగ్ర సదస్సు ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. ఈ సదస్సులో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) పాల్గొని, సదస్సులో కీలక ప్రసంగం చేయడంతో పాటు, పలు దేశాధినేతలతో ద్వైపాక్షిక సమావేశాలు జరిపారు. దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమఫోసా, కెనడా ప్రధాని మార్క్ కార్నీ, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ, జపాన్ ప్రధాని సనే టకాయిచిలతో సమావేశమై పలు కీలక అంశాలపై చర్చించారు.G20 సదస్సు (G20 Summit 2025) లో “అందరికీ న్యాయమైన భవిష్యత్తు” అనే అంశంపై ప్రధాని మోదీ ప్రసంగించారు.

Read Also: Modi Meloni Meet: ద్వైపాక్షిక అంశాలపై మోదీ–మెలోని చర్చలు వేగం అందుకున్నాయి

టెక్నాలజీ వినియోగం ఆర్థిక కేంద్రంగా కాకుండా మానవ కేంద్రంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన కీలక ప్రకటన చేశారు. 2026 ఫిబ్రవరిలో “సర్వజనం హితాయ, సర్వజనం సుఖాయ” అనే నినాదంతో భారత్ ‘ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్‌’కు ఆతిథ్యం ఇవ్వనుందని, ఈ సదస్సులో పాల్గొనాలని G20 దేశాలను ఆహ్వానించారు.

కృత్రిమ మేధ (AI) విషయంలో పారదర్శకత, మానవ పర్యవేక్షణ, దుర్వినియోగాన్ని అరికట్టడం వంటి సూత్రాలతో ప్రపంచ ఒప్పందం అవసరమని నొక్కి చెప్పారు.సదస్సు నిర్వాహక దేశమైన దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమఫోసాతో ప్రధాని మోదీ (PM Modi) ప్రత్యేకంగా సమావేశమయ్యారు. వాణిజ్యం, పెట్టుబడులు, కృత్రిమ మేధ, కీలక ఖనిజాలు వంటి రంగాల్లో సహకారంపై చర్చించారు. భారత్‌కు చీతాలను తరలించినందుకు రమఫోసాకు కృతజ్ఞతలు తెలిపారు.

PM Modi: ‘AI Impact Summit’ to be held in India in 2026

ఇటలీతో కలిసి సంయుక్త కార్యాచరణకు అంగీకరించారు

2026లో బ్రిక్స్ కూటమికి భారత్ అధ్యక్షత వహించనుండగా, తమ పూర్తి మద్దతు ఉంటుందని రమఫోసా హామీ ఇచ్చారు. ఇదే క్రమంలో ఇటలీ, కెనడా, జపాన్ ప్రధానులతోనూ మోదీ విడివిడిగా భేటీ అయ్యారు. ఉగ్రవాదానికి నిధులు అందకుండా నిరోధించేందుకు ఇటలీతో కలిసి సంయుక్త కార్యాచరణకు అంగీకరించారు.

కెనడాతో సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం (CEPA)పై చర్చలు ప్రారంభించాలని నిర్ణయించారు. జపాన్‌తో ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని ఇరు నేతలు అంగీకారానికి వచ్చారు. ఈ సమావేశాల ద్వారా కీలక దేశాలతో ద్వైపాక్షిక సంబంధాలను పటిష్ఠం చేసుకోవడంపై భారత్ దృష్టి సారించింది.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Cyril Ramaphosa meeting G20 Summit Johannesburg latest news Narendra Modi South Africa PM Modi bilateral meetings Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.