📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Latest Telugu News: ASEAN Summit: ప్రధాని మోదీ ఆసియాన్ శిఖరాగ్ర సమావేశానికి దూరం

Author Icon By Vanipushpa
Updated: October 23, 2025 • 4:24 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

మలేసియా రాజధాని కౌలాలంపూర్‌లో ఈ నెల 26 నుంచి 28 వరకు ఆసియాన్(ASEAN Summit) శిఖరాగ్ర సమావేశం జరగనుంది. భారత ప్రధాని మోదీ(Modi) దీనికి హజరు కావాల్సి ఉంది. అలాగే అమెరికా నుంచి అధ్యక్షుడు ట్రంప్(Trump) కూడా ఇందులో పాల్గొనేందుకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇరు దేశాధినేతలూ భేటీ అయ్యేట్టు కూడా ప్లాన్ చేశారు. కానీ ఇప్పుడు అవన్నీ క్యాన్సిల్ అయ్యాయి. దానికి కారణం భారత ప్రధాని మోదీ ఆసియాన్ సమావేశానికి వెళ్ళకపోవడమే. షెడ్యూల్‌ సమస్యల వల్లే మోదీ ఇందులో పాల్గొనలేకపోతున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ప్రధాని మోదీ బదులు విదేశాంగ మంత్రి జైశంకర్ భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తారని చెప్పారు. అయితే మోదీ వర్చువల్‌గా సదస్సుల్లో పాల్గొనే అకాశం ఉందని చెబుతున్నారు. శిఖరాగ్ర సమావేశానికి మలేసియా వెళ్ళే ముందు ప్రధాని మోదీ కంబోడియా కూడా సందర్శించాలని అనుకున్నారు. అయితే ఇప్పుడు ఆ పర్యటన కూడా వాయిదా పడింది. ఇక ఈ సదస్సుకు ట్రంప్‌తో సహా అనేక దేశాల నాయకులు హాజరుకానున్నారు.

Read Also: Pakistan: ఆర్థిక సంక్షోభంతో పాటు టమాటా ధరల విపత్తు

ASEAN Summit

ఆసియాన్ కూటమిలో 10 దేశాలు

ఈ ఆసియాన్‌ కూటమిలో మలేసియా, ఫిలిప్పీన్స్‌, సింగపూర్‌, థాయ్‌లాండ్‌, వియత్నాం, మయన్మార్‌ వంటి 10 దేశాలు సభ్యదేశాలుగా ఉన్నాయి. ఈ దేశాలు రెండేళ్ళకొకసారి ఆగ్నేయాసియా దేశాల ఆర్థిక, రాజకీయ, భద్రత, సామాజిక-సాంస్కృతిక అభివృద్ధికి సంబంధించి సదస్సును నిర్వహిస్తాయి. కొన్నేళ్ళుగా ఈ అన్ని దేశాలతో భారత్ మంచి ద్వైపాక్షిక సంబంధాలను కొనసాగిస్తోంది. వాణిజ్యం, పెట్టుబడి రంగాలతో పాటు భద్రత, రక్షణల్లో సహకారంపై కలిసి పని చేస్తున్నాయి. మరోవైపు ఇందులో సభ్య దేశాలైన థాయ్ లాండ్ కంబోడియాల మధ్య ఘర్షణలు తలెత్తగా..వాటిని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆపారు. కంబోడియా ఆయనను నోబెల్ పీస్ బహుమతికి కూడా నామినేట్ చేసింది. ఈ కారణంగానే ట్రంప్ ఈ శిఖరాగ్ర సమావేశానికి హాజరు కానున్నట్లు తెలుస్తోంది.

ASEAN సమ్మిట్ అంటే మీ ఉద్దేశ్యం ఏమిటి?
ASEAN సమ్మిట్ యొక్క అర్ధాన్ని తెలుసుకోవడం | విదేశీ సంబంధాల మండలి
ASEAN సమ్మిట్ అనేది ఆగ్నేయాసియా దేశాల సంఘం (ASEAN) యొక్క అత్యున్నత విధాన రూపకల్పన సంస్థ, ఇక్కడ సభ్య దేశాల దేశాధినేతలు లేదా ప్రభుత్వాలు సాధారణంగా సంవత్సరానికి రెండుసార్లు సమావేశమై ఆర్థిక, రాజకీయ, భద్రత మరియు సామాజిక-సాంస్కృతిక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకుంటారు.

2026లో ఆసియాన్ శిఖరాగ్ర సమావేశాన్ని ఏ దేశం నిర్వహిస్తుంది?
ఫిలిప్పీన్స్ 2026లో ఆసియాన్ శిఖరాగ్ర సమావేశాన్ని నిర్వహిస్తుంది. ఆ దేశంలో కొనసాగుతున్న రాజకీయ అశాంతి కారణంగా ఆ దేశం ఆతిథ్య బాధ్యతలను మయన్మార్ నుండి తీసుకుంటోంది.

Read hindi news: https://hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

ASEAN 2025 ASEAN Summit Diplomatic Affairs India Foreign Policy International Relations Latest News Breaking News Narendra Modi PM Modi Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.