రష్యాలో ఘోర విమాన ప్రమాదం (Plane Crashed) సంభవించింది. ఇవాళ ఉదయం అదృశ్యమైన అంగారా ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం (Plane Crashed)కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో ఎవరూ ప్రాణాలతో బయటపడే అవకాశం లేదని ప్రముఖ వార్తా సంస్థ రాయిటర్స్ నివేదించింది. అంగారా ఎయిర్‌లైన్స్ కు చెందిన ఏఎన్-24 ప్యాసింజెర్ విమానం ఇవాళ ఉదయం బ్లాగోవెష్‌చెన్స్క్ నుంచి చైనా శివారు ప్రాంతం టైండా పట్టణానికి బయల్దేరింది. మరికాసేపట్లో గమ్యస్థానానికి చేరుకుంటుందనంగా.. విమానం అదృశ్యమైంది. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌తో కాంటాక్ట్ కోల్పోయింది. ఆ సమయంలో విమానంలో 43 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది మొత్తం 49 మంది (Total 49 people) ఉన్నట్లు రాయిటర్స్ నివేదించింది. టైండా పట్టణానికి 15 కిలోమీటర్ల దూరంలో విమానం కూలిపోయినట్లు అధికారులు గుర్తించారు.
తొలుత ల్యాండింగ్‌కు ప్రయత్నించగా.. వాతావరణం అనుకూలించలేదని తెలిసింది. ఆ తర్వాత రెండోసారి ల్యాండింగ్ సమయంలో ఈ విమానం ర్యాడార్ నుంచి గల్లంతై కూలిపోయినట్లు (Plane Crashed) రాయిటర్స్ పేర్కొంది. మరోవైపు ప్రమాద స్థలి నుంచి పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడుతున్నాయి. ఈ ఘటనలో ప్రాణ నష్టానికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియరాలేదు. నివేదికల ప్రకారం.. ఎవరూ ప్రాణాలతో బయటపడే అవకాశం లేదని తెలిసింది.
2025 లో ఎన్ని విమానాలు పడిపోయాయి?
జాతీయ రవాణా భద్రతా బోర్డు గణాంకాల ప్రకారం, 2025 లో 94 విమాన ప్రమాదాలు జరిగాయి. జనవరిలో 63 సంఘటనలు మరియు ఫిబ్రవరిలో 31 సంఘటనలు జరిగాయని ఏజెన్సీ బుధవారం నాటికి తెలిపింది.
విమాన ప్రమాదాలకు కారణం ఏమిటి?
విమాన ప్రమాదాలకు పైలట్ తప్పిదం ప్రధాన కారణం. విమానాన్ని నడపడానికి సుదీర్ఘ శిక్షణ, విమానం యొక్క యాంత్రిక భాగాల పరిజ్ఞానం మరియు విమానాన్ని సమర్థవంతంగా మరియు సురక్షితంగా నడపడానికి చేతి-కంటి సమన్వయ నైపుణ్యాలు అవసరం. పైలట్లు కూడా ముందుకు ఆలోచించాలి.
ఎక్కువగా విమాన ప్రమాదాలు ఎక్కడ జరుగుతాయి?
ల్యాండింగ్ సమయంలోనే ఎక్కువ ప్రమాదాలు జరుగుతాయి. విమాన ప్రమాదాలకు ల్యాండింగ్ అనేది అత్యంత సాధారణ విమాన దశ. IATA డేటా ప్రకారం 2005 మరియు 2023 మధ్య జరిగిన అన్ని ప్రమాదాలలో 53% ల్యాండింగ్ దశలోనే జరిగాయి.
Read hindi news: hindi.vaartha.com