📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

London Plane Crash : లండన్లో కుప్పకూలిన విమానం

Author Icon By Sudheer
Updated: July 14, 2025 • 7:50 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

లండన్ (London) సౌతెండ్ ఎయిర్‌పోర్టులో తీవ్ర ప్రమాదం చోటుచేసుకుంది. ‘బీచ్ B200 సూపర్ కింగ్ ఎయిర్’ అనే చిన్న ప్రయాణికుల విమానం టేకాఫ్ అయిన కొద్ది నిమిషాలకే కుప్పకూలింది. లండన్ నుంచి నెదర్లాండ్స్‌లోని లేలిస్టాడ్‌ నగరానికి వెళ్లే దారిలో ఈ విషాదకర ఘటన జరిగింది. సాంకేతిక లోపమే కారణమా? లేక వాతావరణ పరిస్థితులే కారణమా? అనే దానిపై విచారణ జరుగుతోంది.

విమానాశ్రయాన్ని తాత్కాలికంగా మూసివేత

ప్రమాదం నేపథ్యంలో వెంటనే సౌతెండ్ విమానాశ్రయాన్ని అధికారులు తాత్కాలికంగా మూసివేశారు. విమానం కుప్పకూలిన ప్రాంతాన్ని చుట్టూ బలమైన భద్రత ఏర్పాటు చేశారు. ఆ విమానాశ్రయం నుంచి ఇతర విమానాల రాకపోకలపై కూడా ప్రభావం పడింది. అగ్నిమాపక దళాలు, అత్యవసర వైద్య బృందాలు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించాయి.

యాత్రికుల పరిస్థితిపై క్లారిటీ లేదు

ఈ విమానం సుమారు 12 మీటర్ల పొడవుండి, 20 మంది ప్రయాణికులను మోసుకెళ్లగల సామర్థ్యం కలిగి ఉంది. అయితే ప్రమాద సమయంలో విమానంలో ఎంతమంది ఉన్నారు? ఎవరైనా గాయపడ్డారా? మరణించారా? అనే విషయాలపై ఇంకా స్పష్టత రాలేదు. అధికారులు ప్రమాదానికి గల పూర్తి కారణాన్ని త్వరలో వెల్లడించనున్నట్టు తెలిపారు. ప్రయాణికుల కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.

Read Also : Amaravathi : రూ.1000 కోట్లతో APలో BITS పిలానీ క్యాంపస్ – బిర్లా

Google News in Telugu London plane crash Plane crashes moments after takeoff

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.