రన్‌వేపై విమానం ల్యాండ్ అవుతున్న చివరి క్షణాలు అవి. అంతా నిశబ్ధం.. అంతలోనే ఒక్కసారిగా పెద్ద శబ్దం… అందరిలో కంగారు. ల్యాండ్ అవ్వాల్సిన విమానం మళ్లీ టేకాఫ్ అవుతుంది. ఏమైందో అని అందరిలోనూ టెన్షన్. అప్పుడే పైలట్ నుంచి ప్రకటన.. విమానం ముందు భాగంలోని టైర్ ఊగిపోయింది అని. అంతే ప్రయాణికుల గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి! ఒక్క క్షణం తేడా జరిగి ఉంటే భారీ విమాన ప్రమాదమే జరిగేదేమో! అమెరికాకు చెందిన ప్రముఖ విమానయాన సంస్థ యునైటెడ్ ఎయిర్‌లైన్స్ (United Airlines)కు చెందిన ఓ విమానం ఆదివారం ఓర్లాండో అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండింగ్ సమయంలో ప్రమాదానికి అతి సమీపంగా వెళ్లింది. విమానం రన్‌వేపై దిగుతున్న వేళ ముందు ల్యాండింగ్ గేర్‌కు సంబంధించిన టైరు ఒక్కసారిగా ఊడి పడటంతో ప్రయాణికుల్లో తీవ్ర భయాందోళన నెలకొంది.
Read Also: AP: దావోస్ వేదికగా పెట్టుబడుల వేట.. చంద్రబాబు బృందం
ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు
చికాగోలోని ఓహేర్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి సిబ్బందితో పాటు మొత్తం 206 మంది ప్రయాణికులతో బయల్దేరిన ఈ యునైటెడ్ ఎయిర్‌లైన్స్ విమానం, ఆదివారం ఓర్లాండో చేరుకునే సమయంలో ఈ సాంకేతిక లోపాన్ని ఎదుర్కొంది. ల్యాండింగ్ సమయంలో ముందు భాగంలో ఉన్న టైరు విడిపోయి రన్‌వేపై పడిపోయినప్పటికీ, అప్రమత్తమైన పైలట్ అసాధారణ చాకచక్యంతో విమానాన్ని అదుపులో ఉంచి పెద్ద ప్రమాదాన్ని నివారించాడు. ఈ ఘటనతో విమానంలో ఉన్న ప్రయాణికులు క్షణకాలం ఉత్కంఠకు గురయ్యారు. అయితే విమానం పూర్తిగా ఆగిన తర్వాత ప్రయాణికులందరినీ సురక్షితంగా బయటకు దించామని, ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని అధికారులు స్పష్టం చేశారు. ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. విమానం రన్‌వేపైనే నిలిచిపోవడంతో దానిని తొలగించేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపినట్లు అధికారులు తెలిపారు. ఈ కారణంగా ఓర్లాండో విమానాశ్రయంలో పలు విమానాల రాకపోకలు ఆలస్యమయ్యాయని ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (FAA) వెల్లడించింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: