📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

విదేశీ చదువుల్లో ఏపీ స్టూడెంట్స్ టాప్ సోషల్ వెట్టింగ్ తో భారత్ కు భారీ కుదుపు! భారత్ లో వీసా సర్వీసులను నిలిపేసిన బంగ్లాదేశ్ కూలిన మెక్సికో నేవీ విమానం.. ఐదుగురు దుర్మరణం ఇండోనేషియాలో రోడ్డుప్రమాదం.. 16 మంది దుర్మరణం ట్రంప్ ప్రకటనలో భారీగా తగ్గనున్న మందుల ధర ఢాకాలో హింస.. పత్రికల కార్యాలయాలపై దాడులు కుప్పకూలిన విమానం.. ప్రముఖ రేసర్ కన్నుమూత బంగ్లాదేశ్ లో దారుణం ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు విదేశీ చదువుల్లో ఏపీ స్టూడెంట్స్ టాప్ సోషల్ వెట్టింగ్ తో భారత్ కు భారీ కుదుపు! భారత్ లో వీసా సర్వీసులను నిలిపేసిన బంగ్లాదేశ్ కూలిన మెక్సికో నేవీ విమానం.. ఐదుగురు దుర్మరణం ఇండోనేషియాలో రోడ్డుప్రమాదం.. 16 మంది దుర్మరణం ట్రంప్ ప్రకటనలో భారీగా తగ్గనున్న మందుల ధర ఢాకాలో హింస.. పత్రికల కార్యాలయాలపై దాడులు కుప్పకూలిన విమానం.. ప్రముఖ రేసర్ కన్నుమూత బంగ్లాదేశ్ లో దారుణం ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు

Plane Crash: టర్కీలో కుప్పకూలిన లిబియా విమానం.. ఆర్మీ చీఫ్ దుర్మరణం

Author Icon By Rajitha
Updated: December 24, 2025 • 4:17 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఇటీవల రోడ్డు ప్రమాదాలు, రైలు ప్రమాదాలతో పాటు విమాన ప్రమాదాలు కూడా అధికం అవుతున్నాయి. అంతర్జాతీయంగా పెను సంచలనం కలిగిస్తూ టర్కీ రాజధాని అంకారా సమీపంలో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో లిబియా సైన్యాధ్యక్షుడు (ఆర్మీ చీఫ్) జనరల్ మహమూద్ అలీ అల్ హద్దాద్ మరణించారు. ఆయనతో పాటు ప్రయాణిస్తున్న మరో ఏడుగురు కూడా ఈ ప్రమాదంలో అసువులు బాశారు. ఇరు దేశాలమధ్య రక్షణ సంబంధాలపై కీలక చర్చల నిమిత్తం టర్కీకి (Turkey) వచ్చిన లిబియా ఉన్నతస్థాయి ప్రతినిధి బృందం, తిరిగి స్వదేశానికి వెళ్తున్న క్రమంలో ఈ విషాదం చోటు చేసుకుంది.

Read also: Bangladesh: రేపు క్రిస్మస్ వేళ.. మూతపడ్డ జర్మనీ అమెరికా ఎంబసీలు 

A Libyan plane crashed in Turkey

టక్కీ అధికారుల ప్రకారం ఏం జరిగిందంటే?

అంకారాలోని ఎసెన్ బొఘా విమానాశ్రయం నుంచి బుధవారం రాత్రి 8.30 గంటలకు లిబియా ప్రతినిధి బృందంతో కూడిన ప్రైవేట్ జెట్ టేకాప్ అయ్యింది. అయితే ప్రయాణం మొదలైన 40 నిమిషాలకే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ తో విమానానికి సంబంధాలు తెగిపోయాయి. విమానంలో సాంకేతిక లోపం తలెత్తినట్లు గుర్తించిన పైలట్.. అత్యవసర ల్యాండింగ్ కోసం ప్రయత్నించారు. కానీ రన్ వేకు చేసుకునే లోపే విమానం రాడార్ నుంచి కనిపించకుండా పోయింది. చివరకు అంకారాకు సుమారు 70కిలో మీటర్ల దూరంలో విమాన శిథిలాలను అధికారులు గుర్తించారు.
దుర్మరం చెందిన ప్రముఖులు ఈ ప్రమాదంలో లిబియా సైన్యానికి చెందిన అత్యున్నత స్థాయి కమాండర్లు ప్రాణాలు కోల్పోయారు.

మరణించిన వారిలో లిబియా ఆర్మీ చీఫ్ మహమూద్ అలీ అల్ హద్దాద్, గ్రౌండ్ ఫోర్సెస్ అధిపతి జనరల్ అల్ ఫిటౌరీ ఫ్రైబిల్, మిలటరీ మ్యాన్యుఫ్యాక్చరింగ్ అథారిటీ హెడ్ బ్రిగేడియర్ జనరల్ మహమూద్ అల్ కతావి, చీఫ్ ఆఫ్ స్టాఫ్ సలహాదారు మహమ్మద్ అల్ అసావి దియాబ్, మిలటరీ ఫొటోగ్రాఫర్ మహమ్మద్ ఒమర్ అహ్మద్ మహూబ్ ఉన్నారు. వీరితోపాటు మరో ముగ్గురు పౌరులు కూడా మరణించారు. వీరి మరణాన్ని దృవీకరిస్తూ లిబియా ప్రధాని అబ్దుల్ హమీద్ ధ్రువీకరిస్తూ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కుట్రకోణంపై దర్యాప్తు ప్రమాద సమాచారం అందిన వెంటనే టర్కీ ప్రభుత్వం అంకారా విమానాశ్రయాన్ని తాత్కాలికంగా మూసివేసింది. విమానం కూలిపోవడానికి కేవలం సాంకతిక లోపమే కారణమా? లేక మరేదైనా కుట్ర కోణం ఉందా? అనే దిశగా టర్కీ ప్రభుత్వం దర్యాప్తు ప్రారంభించింది. లిబియా ప్రభుత్వం కూడా ఒక ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని టర్కీకి పంపించింది. లిబియా సైనిక వ్యవస్థలో అత్యంత కీలకమైన వ్యక్తులు ఒకేసారి ఇలా ప్రమాదంలో మరణించడం ఆ దేశానికి కోలుకోలేని దెబ్బగా మారింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

latest news Libya Libyan Army Plane crash Telugu News Turkey

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.